Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్‌బాబుకు సెంటిమెంట్‌. అందుకే సంక్రాంతికి `స‌ర్కారు వారి పాట‌`

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (16:46 IST)
Mahesh Babu, Sarkari vari pata
సూపర్ స్టార్ మహేష్బా బు హీరోగా టాలెంటెడ్ డైరెక్డ‌ర్ పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం 'సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌ల దుబాయ్‌లో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.

గ‌తంలో సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన సూప‌ర్‌స్టార్ మ‌హేష్ చిత్రాలు `ఒక్క‌డు` ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలి‌చింది, అలాగే `బిజినెస్‌మేన్` సెన్సేష‌న‌ల్  హిట్ట‌య్యింది, `స‌రిలేరు నీకెవ్వ‌రు` సెన్సేష‌న‌ల్ ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది. ఇలా సంక్రాంతికి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌కి మంచి విజ‌యాలున్నాయి. ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఎంతో ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వ‌స్తోన్న `స‌ర్కారు వారి పాట` చిత్రాన్ని కూడా 2022 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.
 
ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ పెట్ల మాట్లాడుతూ, ``ఈరోజు మంచిరోజు అని మ‌హేష్ తాళాలు గుత్తి ప‌ట్టుకున్న స్టిల్‌ను విడుద‌ల చేశాం. ద‌స‌రాకు మ‌రో స్టిల్‌ను విడుద‌ల చేయ‌నున్నాం. సినిమాను 2022 సంక్రాంతి పండ‌గ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు `స‌ర్కారు వారి పాట`తో ప్రారంభం`` అన్నారు.
 
ఇంకా ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరియు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి,
సంగీతం: త‌మన్ ఎస్‌.ఎస్‌, సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్,   సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట, రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments