Webdunia - Bharat's app for daily news and videos

Install App

#AcharyaTeaser వచ్చేసింది.. మెగాస్టార్ ఎంట్రీ.. చేతిలో ఎర్ర కండువా పట్టుకుని? (టీజర్)

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (16:32 IST)
Acharya
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూసిన తరుణం వచ్చేసింది. 'ధర్మస్థలి'కి ద్వారాలు తెరుచుకున్నాయి. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ డ్రామా 'ఆచార్య'. కాజల్‌ కథానాయిక. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
 
ధర్మస్థలి తలుపులు తెరుస్తామని చెప్పిన చిత్రబృందం, శుక్రవారం ఆ చోటుకి ప్రవేశాన్ని ఇచ్చేసింది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఇతరుల కోసం జీవించేవాళ్ళు దైవంతో సమానం. అలాంటి వారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడితే దైవమే రావాల్సిన పనిలేదు అంటూ, చిరంజీవిని చూపించారు.
 
పదునైన చూపులతో మెగాస్టార్ ఎంట్రీ అదిరిపోయింది. చేతిలో ఎర్ర కండువా పట్టుకున్న తీరు అద్భుతంగా ఉంది. ఆచార్య సినిమాలో మెగాస్టార్ లుక్ స్పెషల్ గా ఉండనుందని తెలుస్తుంది. టీజర్ చివర్లో చిరంజీవి పేల్చిన డైలాగ్ పీక్స్ అనే చెప్పాలి. 
 
పాఠాలు చెప్పకపోయినా ఆచార్య అని పిలుస్తున్నారంటే గుణపాఠాలు చెప్తా అనే డైలాగ్ అభిమానులకి హుషారు తెప్పించింది. అటు వాయిస్‌తో రామ్ చరణ్ అభిమానులని కూడా సంతృప్తి పర్చిన ఆచార్య టీమ్, మెగాస్టార్‌తో డైలాగ్ చెప్పించి అందరినీ మెప్పించింది. ఈ టీజర్‌ను ఓ లుక్కేయండి. 

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments