Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ

ఠాగూర్
శుక్రవారం, 8 ఆగస్టు 2025 (14:49 IST)
తాను టీవీ సీరియల్స్‌లో నటించే సమయంలో అందరికంటే తనకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారని కేంద్ర మంత్రి, బుల్లితెర నటి స్మృతి ఇరానీ అంటున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బుల్లితెరలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటి తానే అని చెప్పారు. టీవీ సీరియల్స్ ప్రేక్షకాదారణ, రేటింగ్స్ ఆధారంగా రెమ్యునరేషన్ ఇచ్చేవారు. కాంట్రాక్టర్లతో మేము కుదుర్చుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయలేం. అలాంటి పరిస్థితుల్లో కోరినంత రెమ్యునరేషన్ ఇస్తారని వెల్లడించారు.  
 
తాను కూడా ఈ ఇండస్ట్రీలో భాగమైనందుకు నాకూ ఓ నంబర్ ఉందన్నారు. ఆ ఆధారంగానే పారితోషికం తీసుకుంటానని చెప్పారు. అయితే, పారితోషికం విషయంలో ఇతర నటీనటులను అధికమించినట్టు చెప్పారు. తనను చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందుతున్నారని ఇది కేవలం నటన మాత్రమే కాదు.. ఓ బాధ్యత అని స్మృతి ఇరానీ అన్నారు. ఈ సీరియల్‌లో ఇతర నటీమణులైన రూపాలీ గంగూలీ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3 లక్షలు, హీనా ఖాన్ రూ.2 లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం. కాగా, స్మృతి ఇరానీకి మాత్రం రూ.14 లక్షలు చొప్పున ఒక్కో ఎపిసోడ్‌కు తీసుకున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments