Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

Advertiesment
radhika apte

ఠాగూర్

, శుక్రవారం, 8 ఆగస్టు 2025 (11:06 IST)
తాను గర్భవతిగా ఉన్న సమయంలోనూ ఓ నిర్మాత నుంచి ఇబ్బందులు తప్పలేదని సినీ నటి రాధిక ఆప్టే ఆవేదన వ్యక్తంచేశారు. తాను గర్భవతి అయినా తర్వాత తొలి మూడు నెలలు దారుణంగా గడిచాయని ఆమె తెలిపారు. ఓ సినిమా సందర్భంగా నరకం అనుభవించారని చెప్పారు. 
 
ఇదే అంశంపై స్పందిస్తూ, తాను బిగుతైన దస్తులు ధరించకూడదని చెప్పినా వినకుండా, వాటిని వేసుకోవాల్సిందేనని నిర్మాత పట్టుబట్టాడని తెలిపారు. తన పరిస్థితిని అర్థం చేసుకోలేదని, సెట్‌లో నొప్పిగా ఉందని వైద్యుడిన కలిసేందుకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనకు ఎంతో బాధను కలిగించిన విషయమని చెప్పారు. వృత్తిపరంగా తాను ఎంతో ప్రొఫెషనల్‌గా, ఎంతో నిజాయితీగా ఉంటానని, కానీ, ఇలాంటి విషయంలో కొంత మానవత్వం, సానుభూతి అవసరమని ఆమె అన్నారు. 
 
కాగా, బాలకృష్ణ లెజెండ్ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 2015లో వచ్చిన లయన్ సినిమా తర్వాత ఆమె టాలీవుడ్‌కు దూరమయ్యారు. అయితే, బాలీవుడ్‌లో మాత్రం ఆమె బిజీగానే ఉంటున్నారు. 2012లో బ్రిటిషన్ సంగీత దర్శకుడు బెనెడిక్ట్ టేలర్‌ను ఆమె పెళ్లాడారు. పెళ్లయిన పదేళ్లకు ఆమె తల్లి అయ్యారు. గత యేడాది డిసెంబరులో ఆమె బిడ్డకు జన్మించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల