కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ టీవీ, సినిమాల్లో నటించనున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె సినీ, సీరియల్ నటిగా కొనసాగిన విషయం తెల్సిందే. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె తన నటనకు దూరంగా ఉంటున్నారు.
అయితే, తాజా సమాచారం మేరకు ఆమె తిరిగి సినిమాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఒక సిరీస్ కోసం ముఖానికి మేకప్ వేసుకోనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమవుతున్నాయి.
గతంలో పలు సీరియల్స్‌లో ప్రధాన పాత్రలను పోషించిన స్మృతి ఇరానీ.. "అమర్ ఉపాధ్యాయ్" అనే సిరీస్ కోసం తీసుకోవాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్టు, ఈ విషయమై ఇప్పటికే వారిని సంప్రదించినట్టు ఆంగ్ల వెబ్‌సైట్స్‌లో వార్తలు వస్తున్నాయి.
ఏక్తా కపూర్ కోరిక మేరకు మరోమారు కెమెరా ముందు నటించేందుకు స్మృతి అంగీకారం తెలిపారని, తులసి పాత్ర కోసం ఆమె సన్నద్ధం అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. మీడియాలో వైరల్‌గా మారిన ఈ కథనాలపై ఏక్తా కపూర్ టీమ్ నుంచి ఎలాంటి స్పందన లేద. అలాగే, కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ కూడా స్పందించకపోవడం గమనార్హం.