Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దురదృష్టం పరుగెడుతున్నా పట్టుకునేది ఇలాంటివారే

Advertiesment
sleep

సిహెచ్

, శనివారం, 15 మార్చి 2025 (21:56 IST)
ఈ అనంత విశ్వంలో ఉత్తమోత్తమమైన జన్మ మానవ జన్మగా చెబుతారు. కనుక మానవుడిగా పుట్టిన తర్వాత కొన్ని పనులు చేసేవారికి అదృష్ట దేవత వరిస్తే మరికొన్ని పనులు చేసేవారిని దురదృష్టం వెన్నాడుతుంటుంది. సహజంగా ఏమేమి పనులు చేస్తే దురదృష్టం తలుపు తడుతుందో తెలుసుకుందాము.
 
ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రించడం సూర్యుడు ఉదయించినా నిద్రలేవకుండా వుండేవారిని లక్కలా అతుక్కుపోతుంది అన్‌లక్.
మూగజీవుల పట్ల క్రూరత్వం చూపించడం, తోటివారి పట్ల దయలేకుండా వుండేవారిని దురదృష్టం కౌగలించుకుంటుంది.
తమకన్నా వయసులో పెద్దవారిని అవమానకరంగా మాట్లాడటం, దాడులు చేయడం చేసేవారిని అన్‌లక్ ఆలస్యం చేయకుండా పట్టుకుంటుంది.
గోళ్లు కొరికే అలవాటు వున్నవారి కోసం దురదృష్టం నిత్యం ఎదురుచూస్తుంటుంది.
వేరొకరి పురోగతిని చూసి తట్టుకోలేకపోవడంతో అవతలివారు తమకంటే ఉన్నతంగా వున్నారంటూ అసూయ చెందేవారిని దురదృష్టం వెంటాడుతుంది.
అవసరం లేకపోయినా కొందరు నీటిని విపరీతంగా వృధా చేస్తుంటారు. వీరిని కూడా అస్సలు వదిలిపెట్టదు దురదృష్టం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16-03-2025 నుంచి 22-03-2025 వరకు మీ వార ఫలితాలు-ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి.