Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chanakya Niti: ఈ నాలుగు లేని చోట నివసించే వారు పేదవారే.. చాణక్య నీతి

Advertiesment
Chanakya Niti

సెల్వి

, గురువారం, 13 మార్చి 2025 (13:56 IST)
ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకరు. తన నీతి ద్వారా, అతను ఒక సాధారణ యువకుడైన చంద్రగుప్త మౌర్యుడిని విశాలమైన భారత చక్రవర్తిగా మార్చాడు. ఆయన చెప్పిన సత్యాలు నేటికీ మనకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఆచార్య చాణక్యుడు తన న్యాయ గ్రంథంలో, ఈ ఐదు ప్రదేశాలలో నివసించే ప్రజలు ఎల్లప్పుడూ పేదవారిగానే ఉంటారని పేర్కొన్నాడు. ఈ ప్రదేశాలలో నివసించే ప్రజలు ఒక్కరోజు కూడా ధనవంతులు కాలేరు. ఆనాలుగు ప్రదేశాలు ఏమిటో తెలుసుకుందాం. 
 
ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఉపాధి లేని ప్రదేశంలో నివసించే ప్రజలు ఎల్లప్పుడూ పేదవారిగానే ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆదాయం సంపాదించడానికి కచ్చితమైన మార్గం లేదు. అలాంటి ప్రదేశంలో నివసించే ప్రజలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు. వారు తమ జీవితాలను పేదరికంలో గడుపుతారు. ఎప్పుడూ పురోగతి గురించి ఆలోచించరు. 
 
బంధువులు లేని ప్రదేశంలో నివసించేవారు కూడా ముందుకు సాగలేరు. బంధువులు ఉన్న ప్రదేశాలలో ఎల్లప్పుడూ ఆనందం వెల్లివిరుస్తుంది. బంధువులు లేని ప్రదేశాలలో నివసించే వ్యక్తులు తమ జీవితాన్ని తక్కువ స్థితిలో ప్రారంభించి చివరికి అదే స్థితిలోకి చేరుకుంటారు. అలాంటి ప్రదేశంలో నివసించడం నరకంలో నివసించడంతో సమానం. కాబట్టి పురోగతి సాధించాలనుకునే వారు అలాంటి ప్రదేశాన్ని వెంటనే వదిలి వెళ్ళాలి.
 
చదువుకోవడానికి పాఠశాల లేదా గురుకులాలు లేని ప్రదేశంలో నివసించే ప్రజలు ఎప్పటికీ ముందుకు సాగలేరు. ప్రత్యేక విద్యాసంస్థలు లేని ప్రదేశాలలో నివసించకూడదు. విద్య లేకుండా గౌరవం లేదు. అందువల్ల, విద్య లేకుండా జీవించేవారు ఎల్లప్పుడూ పేదవారే. అలాంటి ప్రదేశంలో నివసించడం వల్ల మీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.
 
ఆచార్య చాణక్యుడి ప్రకారం, నీరు, చెట్లు, వ్యవసాయ భూమి మొదలైనవి లేని ప్రదేశంలో నివసించే వారు పేదవారే అవుతారు. ఈ వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ ధనవంతులు కాలేరు. పురోగతి సాధించాలనుకునే వారు అలాంటి ప్రదేశాన్ని వెంటనే వదిలి వెళ్ళాలి. లేకపోతే వాళ్ళ జీవితాలు అక్కడితో ముగిసిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Holi Pournima- హోలీ పౌర్ణమి పూజ ఎలా చేయాలి.. రవ్వతో చేసిన స్వీట్లను నైవేద్యంగా?