ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు మనం హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగను హోలికా పూర్ణిమ, కాముని పున్నమి అని కూడా అంటారు. ఈ పండగ రోజున శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడి దర్శనం చేసుకోవాలి. ఈ పండగ రోజు కేవలం రంగులు చల్లుకోవడమే కాకుండా, పరమేశ్వరుడిని, శ్రీకృష్ణుడిని, అయ్యప్పను ప్రత్యేకంగా పూజించడం వల్ల వారి అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం.
భర్త నుంచి విడిపోయిన వారు ఫాల్గుణ పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి పూజలు చేస్తే భర్తతో కలిసి జీవించే వరం లభిస్తుంది. ఒకవేళ అప్పుల బాధతో బాధపడుతుంటే, గిరి ప్రదక్షణ చేయడం.. శివపూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈరోజు సత్యనారాయణ పూజ చేయడం విశేషం. పూర్ణిమ వ్రతం చేయడం.. చంద్రునికి రవ్వతో చేసిన స్వీట్లను నైవేద్యంగా పెట్టడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి.