Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-03-2025 నుంచి 05-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు..దంపతుల మధ్య అకారణ కలహం

Advertiesment
weekly horoscope

రామన్

, శనివారం, 29 మార్చి 2025 (16:54 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఓర్పు, పట్టుదలే మీ విజయానికి నాంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. తరుచు ఆత్యీయులతో సంభాషిస్తారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆదాయం బాగుంటుంది. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పన్ను చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమిపంచవద్దు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఓర్పుతో ఉద్యోగయత్నాలు సాగించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ప్రైవేట్ సంస్థల వారికి ఓర్పు ప్రధానం. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. దస్త్రం కార్యక్రమం ప్రశాంతంగా సాగుతుంది. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 

మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సమయస్ఫూర్తితో మెలగండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. పనులు చురుకుగా సాగుతాయి. గృహనిర్మాణాలకు ప్లాన్ ఆమోదమవుతుంది. వివాహయత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. గురువారం నాడు నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం. ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా బాగుంటుంది. రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. సమర్థతను చాటుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. కొత్త యత్నాలు మెదలెడతారు. శనివారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవప్రతిష్టలకు భంగం కలుగకుండా మెలగండి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పన్ను చెల్లింపులు, పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. ఉద్యోగస్తులకు పదోన్నతి. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటారు. సాప్ట్‌వేర్ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి.
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోబలంలో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. అవకాశాలు చేజారిపోతాయి. మీ శ్రమ మరొకరికి లాభిస్తుంది. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. సోమవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. మొండిగా ముందుకు సాగుతారు. పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆహ్వానం, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, అధికారులకు స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆత్మీయుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులు అధికం, రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఆదివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో మెలకువ వహించండి. దంపతుల మధ్య అకారణ కలహం, బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ధనప్రలోభాలకు లొంగవద్దు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించవలసి వస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు, అనుభవం గడిస్తారు. నూతన పెట్టుబడులు కలిసిరావు. దస్త్రం వేడుక విజయవంతంగా సాగుతుంది.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. సమష్టి కృషితోనే అనుకున్నది సాధిస్తారు. కొత్త పరిచయాలు బలపడతాయి. తరచు సన్నిహితులతో సంభాషిస్తారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మంగళవారం నాడు ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఒంటెద్దు పోకడ తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకోగల్గుతారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కీలక విషయాల్లో పెద్దల సలహా పాటిస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్నిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిలర్లు, కార్మికులకు పనులు లభిస్తాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం సర్వత్రా యోగదాయకమే. తలపెట్టిన కార్యం విజయవంతవుతుంది. నూతన పరిచయాలు అభివృద్ధికి తోడ్పడతాయి. ఆదాయం బాగుంటుంది. వాహనం, విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. దూరపు బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు, ఔషధ సేవనం క్రమం తప్పకుండా పాటించండి. నూతన వ్యాపారాలపై దృష్టి పెడతారు. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన బదిలీ. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలించకపోవచ్చు. దుబారా ఖర్చులు తగ్గించుకోవటానికి యత్నించండి. కీలక వ్యవహారాల్లో మెలకువ వహించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. పెద్దల సలహా ఉపకరిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పుచేర్పులు సానుకూలమవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. నూతన యత్నాలు మొదలెడతారు. కొందరి వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఓర్పు, అంకితభావంతో శ్రమించాలి. 
 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత, ధనలాభం ఉన్నాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. మీ నుంచి విషయ సేకరణకు కొందరు యత్నిస్తారు. సమయస్ఫూర్తిగా మెలగండి. నూతన పెట్టుబడులపై దృష్టిపెడతారు. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. తరుచు ప్రియతములతో సంభాషిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిన్నవ్యాపారులకు ఆదాయాభివృద్ధి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. ఒత్తిడికి గురికావద్దు. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. సంకల్పబలమే మీ విజయానికి తోడడుతుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. ఆపత్సమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సోమవారం నాడు పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. కనిపించకుండా పోయి వస్తువులు లభ్యమవుతాయి. సంతానానికి శుభఫలితాలున్నాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. చేతివృత్తుల వారికి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29-03-2025 శనివారం దినఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం...