Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-03-2025 శనివారం దినఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం...

Advertiesment
Astrology

రామన్

, శనివారం, 29 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. విశ్రాంతి లోపం, అకాల భోజనం. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు విపరీతం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు సాగవు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. బాధ్యతలు అప్పగించవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొంత మొత్తం పొదుపు చేస్తారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పొదుపు ధనం అందుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులను సంప్రదిస్తారు. ఆపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయుల ప్రోత్సాహం కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సాయం ఆశించవద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. 
 
తుల : చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు వేగవంతమవుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. సన్నిహితుల కలయికతో స్థిమితపడతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. యత్నాలను ఆప్తులు ప్రోత్సాహిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పోగొట్టుకున్న పత్రలు లభ్యమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు పురమాయించవద్దు. విందులు, వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఆరోగ్యం బాగుంటుంది. దూర ప్రయాణం తలపెడతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-03-2025 శుక్రవారం దినఫలితాలు - ఖర్చులు అందుపులో ఉండవు...