Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

Advertiesment
Astrology

రామన్

, బుధవారం, 26 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రుణ సమస్య తొలగుతుంది. చాకచక్యంగా అడుగులేస్తారు. పనులు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. కొత్త యత్నాలు మొదలెడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. చెల్లింపుల్లో జాప్యం తగదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. శుభకార్యంలో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ధనలాభం, వాహససౌఖ్యం ఉన్నాయి. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. మీ శ్రీమతి వైఖరిలో మంచి మార్పు వస్తుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు విపరీతం. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు అప్పగించవద్దు. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పాత పరిచయస్తులు తారసపడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఒత్తిళ్లకు గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఖర్చులు అధికం, బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మనోధైర్యమే మీ విజయానికి దోహదపడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. అతిగా ఆలోచించవద్దు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. ఖర్చులు సామాన్యం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సర్వత్రా మీదే పైచేయి. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. వ్యతిరేకులు చేరువవుతారు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీదైన రంగంలో రాణిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ చిత్తశుద్ధి ఆకట్టుకుంటుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం. తొందరపాటు నిర్ణయాలు తగవు. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు సాగవు. సోదరుల మాటతీరు కష్టం కలిగిస్తుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు వేగవంతమవుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం అవసరం. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు