Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

Advertiesment
Govinda

ఐవీఆర్

, మంగళవారం, 25 మార్చి 2025 (16:36 IST)
అనాధ రక్షకా.. ఆపద మొక్కులవాడా గోవిందా గోవిందా. తిరుమల పుణ్య క్షేత్రాన్ని కోట్లమంది దర్శించుకుంటూ వుంటారు. ఆ గోవిందుడుపై భక్తివిశ్వాసాలకు సంబంధించి ఒక్కొక్కరిది ఒక్కో రకమైన అనుభూతి. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన తిరుమల వేంకటేశ్వరుడు శిలగా ఎందుకు మారాడో తెలుసా?
 
భృగు మహర్షి కుమార్తె భార్గవిగా జన్మస్తుంది శ్రీలక్ష్మీదేవి. ఆమె కోసం వైకుంఠం నుంచి భూలోకానికి శ్రీనివాసుడిగా భూలోకానికి వస్తాడు మహావిష్ణువు. ఐతే లక్ష్మీ అంశ అయిన పద్మావతి దేవి కూడా శ్రీనివాసుడిని మోహిస్తుంది. ఆమె ఆకాశరాజు కుమార్తె. ఆకాశరాజు ఆస్థానంలో వుంటూ భార్గవిని ప్రసన్నం చేసుకుని ఆమెను పెండ్లి చేసుకోవాలనుకుంటాడు శ్రీనివాసుడు. ఐతే ఆ పరమేశ్వరుడు లీలలు చమత్కారంగా వుంటాయి కదా. పద్మావతి నుంచి శ్రీనివాసుడు ఎంతమాత్రం తప్పించుకోలేని స్థితిలో పడిపోతాడు. చివరికి ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతితో శ్రీనివాసుడి వివాహం జరుగుతుంది. ఇది తెలిసిన మహాలక్ష్మి రూపమైన భార్గవి ఆగ్రహంతో అక్కడికి వస్తుంది.
 
తనను ప్రేమించి తనే లోకంగా వున్న నీవు ఆమెను ఎట్లా పెళ్లాడావంటూ నిలదీస్తుంది. అదే ప్రకారంగా శ్రీనివాసుడు తనవాడంటూ పద్మావతి గొడవకు దిగుతుంది. సపత్నుల కలహం ముదిరిపోవడంతో వారికి సర్ది చెప్పలేక శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు. ఆనాటి నుండి నేటికీ తిరుమల కొండపై కొలువైన శ్రీనివాసుడు... తిరుమలేశుడు... గోవిందుడు... ఆ వేంకటేశ్వరుడు ఈ భూలోకం లోనే శ్రీ మహావిష్ణువు రూపంలో వున్న కలియుగ దైవం భక్తుల పూజలందుకుంటున్నాడు. ఓ నమో వేంకటేశాయ... ఓం నమో నారాయణాయ.
 
(ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...