Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తి గీతాలు ఆలపిస్తున్న పాప్ సింగర్

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (15:02 IST)
ఎంతటి హీరోయిన్‌లైనా వయసైపోయాక అక్క, వదిన, అత్తల పాత్రలకు పరిమితం కావడం చూస్తూనే ఉన్నాం... తాజాగా పాప్ సింగర్ స్మిత కూడా దీనికి మినహాయింపేమీ కానని నిరూపించేసుకుంది. 'మసక మసక చీకటిలో.. మల్లెతోట వెనకాలా' అంటూ రీమిక్స్ సాంగ్‌లతో శ్రోతలకు బాగా దగ్గరైపోయిన ఈ పాప్ సింగర్... కొద్ది రోజుల క్రితం వరకు పాటలు, ప్రైవేట్ ఆల్బమ్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విషయం అందరికీ తెలిసిందే. 
 
అయితే... కొత్త తరానికి ఆవిడ బీట్‌లు నచ్చలేదేమో కానీ ఆ తర్వాత క్రమేణా తన పాపులారిటీని కోల్పోయింది. ఒకప్పుడు తెలుగులో రీమిక్స్ పాటలంటేనే స్మిత పాటలు అన్నంతగా ఉండిన మాట నిజమే... కానీ ఇప్పుడొస్తున్న సినిమాల్లోనే పాత పాటలను నేరుగా రీమిక్స్ చేసి వాటికి ఈ తరం హీరో హీరోయిన్లతో స్టెప్పులేయించేస్తూండటం కూడా ఆవిడ డిమాండ్ తగ్గిపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ విధంగా తాను సెట్ కావడం లేదనుకున్న స్మిత తాజాగా తన రూట్‌ని మార్చేసి కొత్తగా భక్తి పాటను ఎంచుకుంది. 
 
సింగర్‌గా తన టాలెంట్ చూపించాలనుకుందో లేక ఎలాగోలా తన పాపులారిటీ తిరిగి సాధించుకోవాలని ప్లాన్ చేసుకుందో తెలీదు కానీ చాలా రోజుల తర్వాత మళ్లీ భక్తి గీతాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే... ఫోక్‌లు, రీమిక్స్‌లతో హల్చల్ చేసిన ఆమె తాజాగా భక్తి గీతాన్ని ఎంచుకోవడం ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. 
 
ఇక ఈ పాట విషయానికొస్తే.. విష్ణు సహస్ర స్తోత్రాన్ని తనదైన శెలిలో ఆలపించిన, 46 నిమిషాల నిడివి గల వీడియో సీడీని స్మిత తిరుమల నుండి విడుదల చేసింది. ఈ వీడియోలో తెలుగు, ఆంగ్ల భాషల్లో స్తోత్రాలను సబ్ టైటిల్స్‌లో చూపిస్తూ అందరికీ అర్థమయ్యేలా జాగ్రత్త పడ్డారు. మరి పాప్ సింగర్ గారి ఈ భక్తి మార్గం... వయసైపోయిన హీరోయిన్‌ల తీరుని గుర్తు చేస్తోందిగా..

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments