Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివకార్తికేయన్-ఏఆర్ మురుగదాస్ పాన్ ఇండియా చిత్రం కీలక షెడ్యూల్ ప్రారంభం

డీవీ
బుధవారం, 13 మార్చి 2024 (18:12 IST)
Sivakarthikeyan - AR Murugadoss - Rukmini Vasanth
శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఉత్తమ తారాగణం,టెక్నీషియన్స్ తో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా యూనిట్ రెండో షెడ్యూల్ షూటింగ్ ని మొదలుపెట్టారు. ఈ కీలక షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలని చిత్రికరిస్తున్నారు.
 
దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన పాపులర్ స్టొరీ టెల్లింగ్ స్టయిల్ లో, యునిక్ సెట్టింగ్‌తో చిత్రాన్ని రూపొందిస్తున్నారు . ఈ చిత్రం హై యాక్షన్-ప్యాక్డ్ అనుభూతిని అందిస్తుంది.
 
వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందజేస్తున్న హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్, గ్రాండియస్ట్ చిత్రం కానుంది. శివకార్తికేయన్ ఇంతకు ముందు చూసినట్లుగా కాకుండా పూర్తిగా ప్రత్యేకమైన, స్టైలిష్  అవతార్ లో కనిపిస్తారు. ట్యాలెంటెడ్ కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు
 
శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజిక్ కంపోజర్ రాక్‌స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అరుణ్ వెంజరమూడు ఆర్ట్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రాఫ్ చేయనున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.

సంబంధిత వార్తలు

రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

గర్భిణి మహిళకు వెజ్‌ స్థానంలో నాన్ వెజ్‌ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments