Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తంతో తడిచిన కత్తితో ఆశిష్ గాంధీ.. కళింగరాజు ఫస్ట్ లుక్

డీవీ
బుధవారం, 13 మార్చి 2024 (17:34 IST)
Kalingaraju first look
నాటకం సినిమాతో హీరోగా ఆశిష్ గాంధీ, దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్‌ను చేయడం విశేషం. ఆశిష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగణ కాంబోలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ స్పెక్ట్రమ్ స్టూడియోస్, సుందరకాండ మోషన్ పిక్చర్స్, కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘కళింగరాజు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్‌తో పాటుగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కళ్యాణ్‌జీ గోగణ, ఆశిష్ గాంధీ కాంబోలో వస్తున్న ‘కళింగరాజు’ చిత్రాన్ని రిజ్వాన్, శ్రీ సాయి దీప్ చాట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
‘కళింగరాజు’ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను బుధవారం నాడు లాంచ్ చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఊరి వాతావరణం కనిపిస్తోంది. ఇక ఆశిష్ గాంధీ కుర్చీ మీద కూర్చున్న తీరు, రక్తంతో తడిచిన ఆ కత్తి, రక్తపు మరకలతో కూడిన ఆ పాల క్యాన్ ఇదంతా  చూస్తుంటే సినిమా అంతా రా అండ్ రస్టిక్‌గా ఉండేలా కనిపిస్తోంది.
 
ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. 90s వెబ్ సిరీస్‌తో సురేష్ బొబ్బిలి ఈ మధ్య ఎంతగా ట్రెండ్ అయ్యారో అందరికీ తెలిసిందే.  చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కెమెరామెన్, దర్శకుడిగానూ సత్తా చాటుతున్న గరుడవేగ అంజి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. రాకేందు మౌళి పాటలు రచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments