Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కమల్ హాసన్ నిర్మిస్తున్న శివకార్తికేయన్ మూవీ టైటిల్ అమరన్

Amaran,  Sivakarthikeyan

డీవీ

, శనివారం, 17 ఫిబ్రవరి 2024 (16:15 IST)
Amaran, Sivakarthikeyan
హీరో శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (“RKFI),  సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ “SK21” టైటిల్‌ను రివిల్ చేశారు. టైటిల్, ప్రధాన పాత్రను రివీల్ చేస్తూ కాశ్మీర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం టీజర్ ఫిబ్రవరి 16న లాంచ్ చేశారు.  ఈ చిత్రానికి "అమరన్" అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.
 
ఉలగనాయగన్ కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్  గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.రాజ్‌కుమార్ పెరియసామి  దర్శకత్వం వహిస్తున్న  ఈ చిత్రం మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో,  రాహుల్ సింగ్, శివ్ అరూర్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” సిరీస్‌లోని ఒక అధ్యాయం ఆధారంగా రూపొందించబడింది.
 
రచయిత-దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి "అమరన్" చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే కోసం చాలా రిసెర్చ్ చేసి రూపొందిస్తున్నారు. ఇది ఇండియన్ సినిమా మాస్టర్ పీస్‌గా మారడానికి సిద్ధంగా ఉంది.
 
 స్టార్ హీరో శివకార్తికేయన్.. నిజ జీవిత హీరో ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకోనున్నారు. మునుపెన్నడూ చూడని డిఫరెంట్ అవతార్ లో కనిపిస్తునంరు. మోస్ట్ ట్యాలెంటెడ్ సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్.
 
అద్భుతమైన టెక్నికల్ టీం ఈ సినిమా కోసం పని చేస్తుంది. స్టార్ కంపోజర్  జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు,  రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ఎడిటర్ ఆర్. కలైవానన్, యాక్షన్ డైరెక్టర్ స్టీఫన్ రిక్టర్, అమృత రామ్ , సమీరా సనీష్‌ కాస్ట్యూమ్ డిజైనర్లు.
 
'మేజర్' లాంటి విజయవంతమైన చిత్రంతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ 'అమరన్'తో తమిళ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
 
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ 51వ ప్రొడక్షన్ గా వస్తున్న అమరన్, 2022లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తుఫాను సృస్టించిన వారి 50వ వెంచర్ "విక్రమ్" బాటలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడానికి సిద్ధమౌతోంది. ప్రొడక్షన్ చివరి దశలో వున్న అమరన్ 2024 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌ చెప్పే శ్రీ‌రంగ‌నీతులు ఏమిటి!