Webdunia - Bharat's app for daily news and videos

Install App

సజిత్ ఖాన్ నా దుస్తులను తొలగించమన్నాడు.. శరీరం చూడాలన్నాడు..

బాలీవుడ్ నటీమణి సిమ్రాన్ సురి కూడా సజిత్ ఖాన్‌పై ఫిర్యాదు చేసింది. 2012వ సంవత్సరం ఓ కొత్త సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. తనను ఇంటికి రావాల్సిందిగా సజిత్ పిలిచాడు.

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (15:38 IST)
బాలీవుడ్ దర్శకుడు సజిత్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేసే మహిళల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం ఊపందుకున్న వేళ.. పలు రంగాలకు చెందిన మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బహిర్గతం చేస్తున్నారు. కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు తమకు జరిగిన దారుణ ఘటనలపై ధైర్యంగా వెల్లడిస్తున్నారు. 
 
ఇటీవల బాలీవుడ్ నటుడు నానా పటేకర్, అలోక్ నాథ్‌లపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు సజిత్ ఖాన్‌పై సలోనీ చోప్రా లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ నటీమణి సిమ్రాన్ సురి కూడా సజిత్ ఖాన్‌పై ఫిర్యాదు చేసింది. 2012వ సంవత్సరం ఓ కొత్త సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. తనను ఇంటికి రావాల్సిందిగా సజిత్ పిలిచాడు. 
 
తాను ఆయన ఇంటికెళ్లినప్పుడు ట్రెడ్‌మిల్‌లో వున్నాడు. తన శరీరాకృతి ఎలా వుందో చూడమన్నాడు. ''ఆ తర్వాత నా దుస్తులను తొలగించమన్నాడు. అంతే నేను షాక్ అయ్యాను. నేను దర్శకుడిని నీ శరీరాన్ని చూడాలి అన్నాడు. కానీ నేను నా దుస్తులను తొలగించలేదు. అయితే ఆయనే నా దుస్తులకు తొలగించేందుకు సజిత్ ప్రయత్నించాడు. 
 
నేను తిట్టడం మొదలెట్టాక.. అరవకు అమ్మ పక్కనే వుందంటూ నా నోరు మూసేశాడు. కానీ అతని నుంచి ఎలాగోలా తప్పించుకుని.. అక్కడ నుంచి తప్పించుకున్నాను. తర్వాత సజిత్ నాకు ఫోన్ చేశాడు. ఇద్దరం కలిసి పని చేయాలంటే.. ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్నాడు. అప్పుడు అతనిని వదల్లేదు. తిట్లదండకం అందుకున్నాను.
 
ఈ విషయం బయటికి చెప్తే ఎవ్వరూ నమ్మరనుకున్నాను. కానీ ఇప్పడు సజిత్ గురించి చాలామంది తమకు జరిగిన చేదు అనుభవాల్ని చెప్తున్నారు. అందుకే అదే ధైర్యంతో మాట్లాడుతున్నాను'' అంటూ సిమ్రాన్ సురి చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం