Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీ బిగ్ బాస్: చిన్నారి పెళ్లికూతురు హీరోకు అలాంటి ప్రశ్న..?!

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (08:46 IST)
Sidharth Shukla
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న హిందీ బిగ్ బాస్ 14 లో హినా ఖాన్, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ హీరో సిద్ధార్థ్ శుక్లాకు మంచి క్రేజ్ వస్తోంది. ఈసారి బిగ్ బాస్‌లో 'తిప్పరా మీసం' హీరోయిన్‌ నిక్కి తంబోలి తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఆమె బలమైన పోటీదారుగా ఎదిగింది. మొదటి రెండు టాస్క్‌లను గెలవడంతో పాటు, ఆమె హౌస్‌లో కన్‌ఫామ్ అయిన మొదటి కంటెస్టెంట్ కూడా. ఈ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా మార్చడంలో దిలాక్, అభినవ్ శుక్లా, జాన్ కుమార్ షాను వంటి ఆర్టిస్టులు కృష్టి చేస్తున్నారు. 
 
ఈ షోలో మొదటగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌గా పంజాబీ నటి, సింగర్‌ సారా గుర్పాల్ నిలిచింది. అలాగే సిద్ధార్థ్ శుక్లాకు వీక్షకుల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇటీవలి ఎపిసోడ్లో, సిద్ధార్థ్ శుక్లాను హినా ఖాన్‌ "ఎవరితోనైనా ప్రేమలో వున్నారా?" అని అడిగింది. దీనికి సిద్ధార్థ్ శుక్లా, "లేదు" అని సమాధానమిచ్చి, "ఎందుకు అలా అడుగుతున్నార"ని హినా ఖాన్‌ను ప్రశ్నించాడు. "నేను మీ ఫ్రెండ్‌ని కాబట్టి" అని చెప్పింది హినా.
 
దానికి సిద్ధార్థ్ శుక్లా, "మీరు నా ఫ్రెండ్‌ అని మీకెవరు చెప్పారు? మీరు నా ఫ్రెండ్‌ కాదు. మీరు హినా ఖాన్, నేను సిద్ధార్థ్ శుక్లా.. మనం స్నేహితులు కాము" అన్నాడు. అతడు చెప్తుంటే అతనివైపే చూస్తూ ఉన్న హినా ఖాన్ నవ్వు ఆపుకోలేకపోయింది. ఈసారి బిగ్ బాస్‌లో 14 మంది పోటీదారులు ఉన్నారు. వారిలో ముగ్గురు 'తుఫానీ' సీనియర్లు ఉన్నారు. వారు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెలుగు చూస్తున్న హెచ్.ఎం.పి.వి కేసులు.. అప్రమత్తమైన ఏపీ సీఎం చంద్రబాబు

భారత్‌లో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్... ఆ రెండు రాష్ట్రాల్లో కొత్త కేసులు..

NTR Vaidya Seva: ఏప్రిల్ 1 నుండి NTR వైద్య నగదు రహిత సేవలు- ఆరోగ్య శాఖ

KTR: కేటీఆర్‌ను వదలని ఈడీ.. మళ్లీ మరో నోటీసు.. ఎందుకని?

రిటైర్మెంట్ వయసులో డిప్యూటీ ఎస్పీ 35 సెకన్ల కామ కోరిక, అతడిని జైలుకి పంపింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments