Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధార్థ్ మూవీ టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మెగా హీరో..?

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (12:36 IST)
నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మ‌రిల్లు, కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం త‌దిత‌ర చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు సిద్ధార్థ్. ఇటీవ‌ల‌ గృహం సినిమాతో ఆక‌ట్టుకున్న సిద్ధార్థ మ‌రో వైవిధ్య‌మైన సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను మెగా హీరో వ‌రుణ్ తేజ్ రిలీజ్ చేసారు.
 
సిద్ధార్థ్, దివ్యంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. 2020 ఫిబ్రవరిలో ఈ మూవీని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
 
సుధన్ సుందరం, జయరాం నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.
 
గతంలో కప్పల్, పాండవుల్లో ఒకడు చిత్రాలకు దర్శకత్వం వహించిన కార్తిక్ జీ క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. 
 
నివాస్ కె ప్రసన్న ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ మూవీ సిద్ధార్థ్‌కు మ‌రో విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి - సురక్షితంగా తొలగించిన వైద్యులు

నెరవేరిన శపథం... సీఎంగా చంద్రబాబు - ఐదేళ్ళ తర్వాత పుట్టింటికి మహిళ!

పిన్నెల్లి సోదరులపై మాచర్ల పోలీసుల రౌడీషీట్!!

అన్న చనిపోయాడని వదినను పెళ్లాడిన యువకుడి హత్య.. ఎక్కడ?

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments