Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మావయ్యా.. అలాంటి చెత్త సినిమాలు ఇక చేయకు: కోడలు సమంత ఫైర్?

webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (17:42 IST)
నాగార్జున, సోనాలి బెంద్రే నటించిన మన్మథుడు చిత్రం ఎన్నిసార్లు చూసినా ఇంకా చూద్దాం అనేంత ఆసక్తిగా వుంటుంది. అలాంటిది మన్మథుడు 2 చిత్రం చూసేందుకు వెళ్లిన ప్రేక్షకుడు ఎప్పుడు కుర్చీ లోనుంచి లేచిపోదామా అని ఆత్రుతపడ్డాడంటే ఆ చిత్రం ఎంత చెత్తగా వుందో అర్థం చేసుకోవచ్చు. మన్మథుడు 2 చిత్రం ఆహా ఓహో అన్నారు కానీ అది నాగార్జునకు విపరీతమైన విమర్శలను మోసుకు వచ్చింది. 
 
ఇకపోతే ఈ చిత్రాన్ని ఇటీవలే ఓ ఛానల్ వాళ్లు టీవీలో వేసారు. మన్మథుడు 2 చిత్రం అనగానే, పెద్దలంతా టీవీలను టపుక్కున ఆపేశారట. ఎందుకంటే ఆ చిత్రంలో వున్న సీన్లు అట్లాంటివి. ఇలా మన్మథుడు 2 అటు పెద్ద తెరపైన ఇటు బుల్లి తెరపైన ఘోరంగా విఫలమైంది. మరోవైపు మన్మథుడు 2 చిత్రం చూసిన తర్వాత నాగార్జున కోడలు సమంత కూడా అసంతృప్తి వ్యక్తం చేశారట. 
 
ఐతే ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన రాహుల్ రవీంద్రన్ తన స్నేహితుడే కనుక ఏమీ అనలేకపోతోందట కానీ నాగార్జునతో మాత్రం ఇలాంటి చెత్త సినిమాల్లో నటించవద్దని సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరి బిగ్ బాస్ 3 పూర్తయ్యాక మన్మథుడు 2 చిత్రం బిగ్ షాక్ ఇచ్చిన నేపథ్యంలో నాగార్జున నెక్ట్స్ ప్లాన్ ఏంటో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

#1 ON TRENDING డిస్కో రాజా టీజర్ (Video)