Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రద్ధా శ్రీనాథ్‌పై సమంత అభిమానులు ఫైర్..

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (12:25 IST)
వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్, అక్కినేని సమంత సినిమాపై కామెంట్ చేసి నెటిజన్ల విమర్శలకు గురైంది నటి శ్రద్ధా శ్రీనాథ్. వివరాలలోకి వెళ్తే... కన్నడలో వచ్చిన ‘యూ టర్న్’ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో సమంత ‘యూ టర్న్’ తెరకెక్కింది. కన్నడలో శ్రద్ధా శ్రీనాథ్ నటించగా.. అదే పాత్రను తెలుగులో సమంత పోషించింది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ.. సమంత నటించిన ‘యూ టర్న్’ సినిమాను తాను అరగంట కంటే ఎక్కువ సేపు చూడలేక పోయాననీ... తాను చాలా పొసెసివ్ అనీ... తాను పోషించిన పాత్రలో మరొకరిని ఉహించుకోలేకపోతున్నానని పేర్కొంది.
 
అయితే... ఇది చూసిన సమంత అభిమానులు శ్రద్ధా శ్రీనాథ్‌పై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టేస్తున్నారు. తెలుగులో ఏ మాత్రం అనుభవం లేని శ్రద్ధా.. టాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్ మాత్రమే కాకుండా స్టార్ హీరోయిన్ కూడా అయిన సమంతపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏ మాత్రం సబబు కాదని సమంత అభిమానులు అంటున్నారు. ఈ అన్ని గందరగోళాల మధ్య... శ్రద్ధా శ్రీనాథ్ తొలిసారిగా తెలుగు తెరపై తెరంగేట్రం చేస్తూ... నానీ హీరోగా రూపొందిన ‘జెర్సీ’ చిత్రం ఏప్రిల్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
మరి ఈ సినిమా తర్వాత శ్రద్ధ శ్రీనాథ్ ఇంకెన్ని చెప్తారో వేచి చూద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

ACP: హీరోయిజం ఇంట్లో.. బయటకాదు.. ఓవర్ చేస్తే తోక కట్ చేస్తాం: ఏసీపీ (Video)

Telangana: 14 ఏళ్ల బాలిక స్కూల్ బిల్డింగ్ నుంచి పడిపోయింది.. చివరికి?

Telangana: భార్య తెలియకుండా రుణం తీసుకుందని భర్త ఆత్మహత్య

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments