Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమంత - చైతన్య 'మజిలీ' సంబరాలు

Advertiesment
సమంత - చైతన్య 'మజిలీ' సంబరాలు
, మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (14:57 IST)
"మజిలీ" సినిమా విజయ పరంపర కొనసాగిస్తుండటంతో అక్కినేని కాంపౌండ్ ఆనందోత్సాహలతో ఉంది. అయితే ఏ రేంజ్ హిట్ ఫైనల్‌గా ఎంత వసూలు చేస్తుందని ముందుగా చెప్పడం తొందరపాటు అవుతుంది. ఒక వారం గడిచాక దీనిపై స్పష్టత వస్తుంది. చైతు హిట్ కొట్టి రెండు సంవత్సరాలు దాటింది. 'యుద్ధం శరణం', 'శైలజారెడ్డి అల్లుడు', 'సవ్యసాచి' ఊహించిన స్థాయిలో హిట్ కొట్టలేకపోయాయి. దానికి తోడు అఖిల్ తీసిన "మిస్టర్ మజ్ను" కూడా డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో నాగ్ పైకి చూపించకపోయినా మనసులో కొంత ఆందోళన చెందుతూ వచ్చాడు. 
 
వీటన్నింటిని వలన పోయిన ఉత్సాహాన్ని "మజిలీ" తిరిగి తీసుకురావడంతో అక్కినేని కాంపౌండ్‌లో సంతోషానికి తిరుగు లేకుండా పోయింది. ఈ సందర్భంగా అఖిల్ పుట్టినరోజును కూడా గ్రాండ్‌గా జరుపుకున్నట్లు తెలుస్తోంది. కోడలు అడుగుపెట్టిన వేళా విశేషం కాబోలు తనతో కలిసి తీసిన సినిమాతోనే చైతు హిట్ కొట్టడం గమనార్హం. తెలుగు కొత్త సంవత్సరంలో 'మజిలీ'తో పరాజయాల పరంపరకు చెక్ పడిందని అక్కినేని కుటుంబం ఫీలింగ్. 
 
ప్రస్తుతం నాగ్ చేస్తున్న "మన్మథుడు-2"పై కూడా భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇది కూడా హిట్ కొడితే నాగ్‌కు ఇంతకాలం పడిన ఇబ్బందుల నుండి రిలీఫ్ దక్కుతుంది. అదేవిధంగా అఖిల్ నాలుగో చిత్రానికి కూడా రంగం సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్‌తో చేయొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఇంకా కాస్త టైమ్ పట్టొచ్చని సమాచారం. నాగ్ కుటుంబం మాత్రం 'మజిలీ' వేడుకలలో మునిగిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెంప ఛెళ్లుమనేలా జవాబిచ్చిన జాహ్నవి