Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెనీలియాపై 'వల్గర్‌ ఆంటీ' ట్రోల్స్: అతని ఇంట్లో పరిస్థితులు బాలేదేమో..?

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (17:59 IST)
రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా జంట సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటారు. ఫన్నీగా.. రొమాంటిక్‌గా ఎప్పటికప్పుడు ఈ జంట వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటారు. చాలావరకూ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. వారి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవ్వగా కొందరు నెటిజన్లు 'వల్గర్‌ ఆంటీ' అంటూ ట్రోల్‌ చేశారు.
 
గతంలో నటి ప్రీతి జింటాని రితేశ్‌ చేతులపై ముద్దు పెట్టకోగా, జెనీలియా జలసీతో చూస్తూ ఉంది. ఇంటికి వెళ్లిన తర్వాత జెనీలియా కోపంతో భర్తను కొడుతున్నట్లు, ఆయన వద్దు అని వేడుకుంటున్నట్లు ఉన్న ఆ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యింది. 
 
ఈ వీడియో కింద ఎంతో మంది కామెంట్లు చేశారు. ఓ నెటిజన్‌ 'సిగ్గు లేదా, వల్గర్‌ ఆంటీ. ఎప్పుడూ ఓవర్‌ యాక్టింగ్ చేస్తుంటావ్‌. ఇది నీ ముఖానికి సెట్‌ అవ్వదు' అని కామెంట్‌ పెట్టాడు. దీనిని ఓ షోకు వెళ్లిన రితేశ్-జెన్నీ దంపతులకు చదివి వినిపించారు. 
 
దానిపై స్పందించిన జెనీలియా 'అతని ఇంట్లో పరిస్థితులు బాలేనట్లు ఉన్నాయి అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. భాయ్ సాబ్, మీరు ఇంట్లో బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను' అంటూ ఘాటుగా స్పందించింది. జెనీలియా చూడడానికి క్యూట్‌గా ఉంటుంది కానీ.. ఇలాంటి విమర్శలు చేస్తే మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తూ ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాపట్ల ఈపూరిపాలెం యువతి అత్యాచారం కేసు: నిందితులు అరెస్ట్, గంజాయి తీసుకుని... (video)

మహిళపై పాశవిక దాడి.. కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి? (video)

హలో సీఐ సర్, ఆడబిడ్డ మిస్ అయి 9 నెలలైందట, వెంటనే చూడండి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

రోడ్డుపై ఆవులు.. టూవీలర్‌పై వచ్చిన వ్యక్తిపై ఎక్కి దిగిన బస్సు.. ఎక్కడ?

ఏడాది వయస్సున్న బిడ్డను హత్య చేసిన తండ్రి.. ఎందుకంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments