ధనుష్ అంటే నాకు చాలా ఇష్టం.. బ్రూస్లీని చూసినట్టుంది: శివన్న

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (20:26 IST)
ధనుష్ అంటే తనకు చాలా ఇష్టమని.. కన్నడ స్టార్ శివ కుమార్ అన్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 
ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగ‌రాజ‌న్‌, ఆర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు.
 
ఈ సినిమాలో శివన్న కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈ సినిమా డిసెంబర్15వ తేదీన తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. జైలర్ తర్వాత తమిళ సినిమాలో శివన్న కనిపిస్తున్నారు.
 
ఈ సినిమాపై శివన్న తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఈ సినిమా కథ నా దగ్గరకు వచ్చినప్పుడు నా రోల్ చాలా బాగా నచ్చింది. మొదటి నుండీ ధనుష్ అంటే నాకు ఇష్టం. చాలాసార్లు తనలో నన్ను నేను చూసుకున్నాను. ధనుష్‌ను చూస్తే బ్రూస్లీని చూసినట్టు ఉంటుంది.." అంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments