Webdunia - Bharat's app for daily news and videos

Install App

శింబు కంట‌త‌డి - ఓదార్చిన స్నేహితులు ఎందుకో తెలుసా!

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (10:20 IST)
Simbu- maa naadu
త‌మిళ‌నాడులో స్టార్‌గా ఎదిగిన శింబు రానురాను వివాదాలకు గుర‌వుతున్నారు. తాజాగా ఆయ‌న న‌టించిన యాక్షన్ డ్రామా ‘మానాడు’. గురువారం నాడు చెన్నైలో ప్రీరిలీజ్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వేదిక‌పై హాజ‌రైన ప్ర‌ముఖులు చిత్రం గురించి మాట్లాడారు. ఆ త‌ర్వాత శింబు మాట్లాడుతూ, ఒక్క‌సారిగా భావోద్వేగానికి లోనవుతూ, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయ‌న మాట్లాడిన అనంత‌రం కుర్చీలో కూర్చోగానే అదే మూడ్‌లో వుండ‌డం చూసిన  చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు, శింబు స్నేహితుడు, నటుడు మహత్ వేదికపై శింబును ఓదార్చారు. 
 
ఒక్క‌సారిగా జ‌రిగిన ఈ ప‌రిణామం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేసింది. దీనికి కార‌ణం కూడా శింబు పేర్కొన్నారు. ప‌రిశ్ర‌మ‌లోని కొందరు వ్యక్తులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ అంటూ వారి పేర్ల చెప్ప‌కుండానే ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
 
 “నేను చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాను. కానీ వాటన్నింటినీ నేను చూసుకుంటాను. మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ శింబు తన అభిమానులను కోరాడు. ఇది ఈ వేడుక‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వ్య‌క్తిగ‌తంగా, న‌ట‌నాప‌రంగా శింబు ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు.

అప్పుడెప్పుడో న‌య‌న‌తార ఇష్యూ నుంచి ఆ త‌ర్వాత షూటింగ్‌ల‌కు గైర్హాజ‌రు కావ‌డం వ‌ర‌కూ ఆయ‌న‌పై తమిళ నిర్మాతల మండలి రెడ్ కార్డ్ కూడా జారీ చేసింది. ఆ త‌ర్వాత ప్ర‌స్తుతం సినిమా `మానాడు` కూడా ఆల‌స్య‌మైంది. దానికి శింబు కార‌ణ‌మ‌ని నిర్మాత సురేష్ కామచ్చి ఫిర్యాదు చేశారు. ఫైన‌ల్‌గా ప‌రిష్క‌రించి శింబు సినిమా విడుద‌ల‌కు తీసుకువ‌చ్చాడు. ఈ సినిమా ఈనెల 25న విడుద‌ల‌కాబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments