Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు మాత్రమే ముఖ్యం కాదు... అర్జున్ రెడ్డి హీరోయిన్..

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (10:35 IST)
టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన "అర్జున్ రెడ్డి" సినిమా విజయ్ దేవరకొండకు ఎంత పేరు తెచ్చిపెట్టిందో, హీరోయిన్ షాలిని పాండేకి కూడా అంత క్రేజ్ సంపాదించి పెట్టింది. ఆ సినిమాలో ఆమె చేసిన ముద్దు సీన్లు ఎంతో న్యాచురల్‌గా ఉంటాయి. సాధారణంగా ముద్దు అనేది ఒక ఎమోషన్‌. కనుక ఆ సీన్లో యాక్ట్ చేసేటప్పుడు కేవలం ఎమోషన్ మాత్రమే కాకుండా ఇష్టం కూడా ఉండాలి. 
 
అలా చేసినప్పుడే సన్నివేశం సహజంగా అనిపిస్తుంది. ఆ సినిమా తరువాత షాలిని పాండే చిన్న పాత్రలలో కనిపించిందే కానీ పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రలో నటించలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత తాజాగా ‘118’ సినిమాలో హీరోయిన్‌‌గా నటించింది. ఈ సినిమా హిట్ కొట్టిన నేపథ్యంలో ‘అర్జున్‌ రెడ్డి’ తరువాత ఇంత గ్యాప్‌ ఎందుకు తీసుకున్నారని అడగగా ఆవిడ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది.
 
నాకు కథ, నా పాత్ర నచ్చితేనే ఆ సినిమా చేస్తాను..మహానటి, కథానాయకుడు సినిమాలలో చేసినవి చిన్న పాత్రనే అయినప్పటికీ నాకు మంచి పేరు వచ్చేలా చేసాయి. ‘118’లో కూడా అలాంటి మంచి పాత్రే లభించింది. 
 
‘అర్జున్‌ రెడ్డి’ తరువాత చాలా కథలు విన్నాను, కానీ నాకు ఏదీ నచ్చకపోవడంతో ఏ సినిమాకు సైన్ చేయలేదు. నాకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదు, మానసిక సంతృప్తి కూడా కావాలి. ఒకవేళ డబ్బు కోసమే ఈ రంగంలోకి వచ్చుంటే నేను ప్రతి అవకాశాన్ని అంగీకరించేదాన్నేమో! సినిమాకు కథ ఎంతో బలం. అందుకే కథ నచ్చితే అది పెద్ద సినిమానా? చిన్న సినిమానా? అని చూడకుండా ఒప్పుకుంటానని షాలిని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments