విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత పెద్ద స్థాయిలో నిల్చిపోయి... అతనిని సడన్ స్టార్‌గా చేసేస్తూ తెలుగు తెరపై కొత్త ముద్ర వేసిన సినిమా ''అర్జున్ రెడ్డి''. నటీనటుల ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం ఈ చిత్రానికి మర్చిపోలేని విజయాన్ని అందించాయి.
ఇందులో తెరపై ఎక్కడా అర్జున్, ప్రీతి పాత్రలు తప్ప విజయ్ దేవరకొండ, షాలినీ పాండేలు కనిపించలేదంటే అతిశయోక్తి కాదేమో... వీరిద్దరి మధ్య గాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరించిన విధానం యువ ప్రేక్షకులను కట్టి పడేసింది.
ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలసి నటించబోతున్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఆనంద్ అన్నామలై దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఇందులో కథానాయిక పాత్ర కోసం షాలినీ పాండేని తీసుకున్నట్లు సమాచారం. క్రీడా నేపథ్యంలో సాగే కథ ఇది. విజయ్ ఓ రేసర్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈసారి ఈ జంట మరేం చేస్తారో చూద్దాం మరి..!