Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేణు మాధవ్ నేను ఒకే పడకపై నిద్రించాం.. మంచితనం గురించి షకీలా (video)

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (17:19 IST)
వేణుమాధవ్ మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి వార్తను విని సినీ నటులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్ర వేశారు వేణుమాధవ్.

టాలీవుడ్‌లో 250 సినిమాలకు పైగా నటించారు. మిమిక్రీ కళాకారుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన టాలీవుడ్ టాప్ కమెడియన్ స్థాయికి ఎదిగారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సంప్రదాయం చిత్రం ద్వారా వేణుమాధవ్ సినీ రంగ ప్రవేశం చేశారు. పవన్ కల్యాణ్ నటించిన తొలి ప్రేమ చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్‌ల ఉన్న అగ్రనటులందరితోనూ నటించారు. 
 
ఈ నేపథ్యంలో వేణు మాధవ్‌తో తమకున్న అనుబంధాన్ని సినీ తారలు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా వేణుమాధవ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వేణు మాధవ్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో, కామెడీ సీన్లు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అలాంటి వాటిల్లో శృంగార తార షకీలా వేణు మాధవ్ చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా వేణు మాదవ్ మంచితనం గురించి చెప్పుకొచ్చింది. 
 
ఒక సినిమా షూటింగ్ కోసం వేణు మాధవ్, రఘు బాబు, బ్రహ్మానందం ఓ హోటల్‌లో వున్నామని. ఆ సమయంలో తమను చూసేందుకు బయటి నుంచి చాలామంది అభిమానులు వచ్చారన్నారు. ఆ సమయంలో వేణు, మిగతా చిత్ర యూనిట్ సభ్యులు జోక్స్ చెప్పుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ తన గదిలోనే ఉన్నారని చెప్పారు. 
 
అయితే వాళ్ల అల్లరికి తన గది చిందరవందరగా మారిందని.. దాంతో ఆ రాత్రి వేణు గదిలో పడుకోవాలనుకున్నానని చెప్పారు. ఇదే విషయం వేణుతో చెబితే సరేనన్నాడని తెలిపారు. వేణు గదిలో ఇద్దరం ఒకే బెడ్‌పై పడుకున్నామని.. తమ అసిస్టెంట్ కొద్ది దూరంలో సోఫాలో పడుకున్నాడని చెప్పారు. 
 
ఆ సమయంలో వేణు మాధవ్.. నేనొక విషయం అడగాలనుకుంటున్నానని చెప్పాడు. దాంతో భయపడ్డానని.. చివరికి ఏంట్రా నీ ప్రాబ్లమ్ అని అడిగేసరికి తనకు, అతనికి మధ్య పిల్లోస్ పెట్టాడని షకీలా చెప్పుకొచ్చింది. దాంతో తాను ఆశ్చర్యపోయానని వెల్లడించింది. 
 
''నాకు పెళ్లయి ఇద్దరు బిడ్డలు ఉన్నారని తెలుసు కదా.. నువ్వు నిద్రలో ఒకవేళ నీ కాలు గనుక నాపై వేస్తే అంతే సంగతి. కాబట్టి నువ్వు కాలు వేసుకోవాలనుకుంటే.. ఆ పిల్లోపై వేసుకో" అంటూ చెప్పాడని షకీలా ఆ వీడియోలో వెల్లడించింది. వేణు మాధవ్ అలా పిల్లోస్ వేయడంపై రెండు రోజుల పాటు కడుపుబ్బా నవ్వుకున్నామని షకీలా తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments