Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంపూ నన్ను అమ్మా అని పిలిచేవాడు.. బిగ్ బాస్‌‌ హౌజ్‌లోకి వెళ్లే ఛాన్స్ వస్తే?: షకీలా

Advertiesment
సంపూ నన్ను అమ్మా అని పిలిచేవాడు.. బిగ్ బాస్‌‌ హౌజ్‌లోకి వెళ్లే ఛాన్స్ వస్తే?: షకీలా
, మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (18:47 IST)
శృంగార నటి షకీలా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. తాజాగా ఆమె బిగ్ బాస్ మూడో సీజన్ గురించి నోరు విప్పింది. బిగ్ బాస్ షో అంటే తనకు ఇష్టముండదని చెప్పేసింది. బిగ్ బాస్ షోను తాను ఏ భాషలోనూ చూడట్లేదని వెల్లడించింది.

కానీ సినీ లెజెండ్ కమల్ హాసన్ సర్ అంటే తనకు చాలా ఇష్టం కాబట్టి, శని, ఆదివారం ఆయన హోస్ట్ చేసే షోను మాత్రం చూస్తుంటానని తెలిపింది. బిగ్ బాస్ కన్నడం తొలి రెండు సీజన్లలో తాను పాల్గొన్నాను. మూడు వారాలు కూడా వున్నాను. కానీ తనవల్ల కాలేదు. టాస్కుల్లో గెలవలేకపోయానని షకీలా వెల్లడించింది. 
 
తమిళ బిగ్‌బాస్‌ను మాత్రం అప్పుడప్పుడు చూస్తుంటాను. అది కూడా కమల్ సర్ కోసమేనని షకీలా తెలిపింది. ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ షోలో ఆర్టిస్టులు ఎవరూ తనకు తెలియదని షకీలా చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షోలో కావాలని రేటింగ్స్ కోసం గొడవలు పెట్టుకుంటారనే అపవాదుపై షకీలా స్పందిస్తూ.. అలాంటిది వుండదని, అక్కడ పరిస్థితులే హౌజ్‌లో వున్నవారిని ఒత్తిడికి గురిచేస్తాయని చెప్పుకొచ్చింది. కోపం, సభ్యుల ప్రవర్తన గొడవలకు కారణమవుతాయని షకీలా వెల్లడించింది. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ.. తెలుగు బిగ్ బాస్ సీజన్‌లో భాగంగా హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే వెళతారా? అనే ప్రశ్నకు ఇలా స్పందించింది. ఎండమోల్ సంస్థ ఒకసారి తీసుకుంటే వారిని మళ్లీ తీసుకోరని అనుకుంటున్నానని తెలిపింది. ఆల్రెడీ తాను కన్నడలో చేశాను. అయినా తనకు వెళ్లే ఆసక్తి కూడా లేదు. ఆ గొడవలు అవన్నీ తన వల్లకాదని షకీలా వెల్లడించింది. 
 
కొబ్బరి మట్ట సినిమాలో సంపూర్ణేష్‌తో నటించిన అనుభవాన్ని గురించి షకీలా చెప్తూ.. కొబ్బరి మట్ట షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఈ విషయం గురించి టాపిక్ వచ్చేది. సంపూ తనను అమ్మా అని పిలేచేవాడు. తెలుగులో ప్రసారమైన గత బిగ్ బాస్ సీజన్లలో సంపూ వెళ్లింది చూశాను, సంపూ బయటకు వచ్చింది చూశాను. మిగతా ఏవీ చూడలేదని షకీలా వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ తెలుగు 3.. త్యాగానికి సిద్ధపడిన హౌజ్ మేట్స్.. బాబా భాస్కర్ క్లీన్ షేవ్