Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ ఫోన్ చేసినందుకు సంబరపడిపోయా: షాహిద్ కపూర్

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (17:38 IST)
బాహుబలి సినిమాతో భారత సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రభాస్, ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారాడు. బాలీవుడ్ హీరోలు సైతం ప్రభాస్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్ కూడా ఆ లిస్ట్‌లో చేరిపోయాడు. ప్రభాస్ తనకు ఫోన్ చేసినప్పుడు ఎంతో సంబరపడిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. 
 
షాహిద్ కపూర్ తాజాగా నటించిన ‘కబీర్‌ సింగ్’ టీజర్‌ విడుదలైనప్పుడు ప్రభాస్‌ ఎంతో మెచ్చుకున్నారు. ‘అర్జున్‌ రెడ్డి’ కంటే ‘కబీర్‌ సింగ్’ బాగుందని ప్రభాస్‌ అభిప్రాయపడ్డారు. ఇదే విషయమై ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌కు, తనకూ ఒకే హెయిర్‌ స్టైలిస్ట్‌ ఉన్నాడని, అతని పేరు ఆలిమ్ హకీమ్ అని చెప్పాడు. 
 
వారిద్దరూ ‘కబీర్‌ సింగ్‌’ టీజర్‌ గురించి చర్చించుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్‌ తనకు కంగ్రాట్స్‌ చెప్పడానికి ఫోన్‌ చేశాడట. దాదాపు పది నిమిషాలు మాట్లాడారు. అందుకు తాను ఎంతో సంబరపడిపోయాను అని షాహిద్ తెలిపారు.
 
కాగా కబీర్ సింగ్ ట్రైలర్‌లో అర్జున్ ‌రెడ్డి పాత్రను డిట్టోగా చూసినట్లు ఉందని నెటిజన్లు కామెంట్‌లు చేసిన నేపథ్యంలో షాహిద్ ఈ విషయమై స్పందిస్తూ..అర్జున్ రెడ్డిలో విజయ్‌దేవరకొండ అద్భుతంగా నటించారు. కబీర్ సింగ్ మరియు అర్జున్ రెడ్డి ఒక్కటి కాదని అందరూ గమనించాలని, వీరిద్దరూ కజిన్స్‌లాంటివారు అని పేర్కొన్నారు. 
 
ఈ సినిమా ద్వారా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నామని, అందువల్లే సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ఢిల్లీ, ముంబైకి మార్చాం అని, అలాగే హీరో పాత్రకు సంబంధించిన కుటుంబ నేపథ్యాన్ని కూడా మార్చాం అని తెలివారు. అయితే క్యారెక్టర్‌కి ఉండాల్సిన ఎనర్జీ మాత్రం అలాగే ఉందని వెల్లడించారు. కబీర్ సింగ్‌లో షాహిద్‌కు జోడీగా కియరా అద్వానీ నటించింది. ఈ చిత్రం జూన్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments