Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నితిన్ హిట్ కోసం ఏమి చేయబోతున్నాడు?

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (17:19 IST)
హీరో నితిన్ వరుస ఫ్లాప్‌లతో కాస్తంత స్లో అయ్యాడు. 'అ ఆ' సినిమాతో ఫర్వాలేదనిపించినా 'లై', 'చల్ మోహన్ రంగా', 'శ్రీనివాస కళ్యాణం' వంటి వరుస డిజాస్టర్లతో నితిన్ మార్కెట్ బాగా పడిపోయింది. తాజాగా నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్న 'భీష్మ' సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. 
 
దీంతో పాటు క్రియేటివ్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. నితిన్-చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో సోషల్ మెసేజ్ ఉంటుందని తెలుస్తోంది.
 
ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ కూడా ఉండబోతోందని సన్నహిత వర్గాలు చెబుతున్నాయి. సినిమాలో అవయవ దానం కాన్సెప్ట్ హైలెట్ కాబోతోందని వార్తలు బయటకు వస్తున్నాయి. 
 
ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్‌తో పాటే ఎమోషన్లు కూడా ఎక్కువగా ఉంటాయని, ఈ సన్నివేశాలు ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టిస్తాయి అని తెలుస్తోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ చిత్రం నితిన్‌కి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలంటే వేచి చూడక తప్పదు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments