Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంజారా ఔన్నత్యాన్ని తెలిపే సేవాదాస్

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (15:21 IST)
Suman, Bhanuchander, KPN Chauhan and others
శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం "సేవాదాస్". సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని, వినోద్ రైనా-రేఖా నిరోష హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...ఈ చిత్రంలో సేవాలాల్ గా నటించిన సీనియర్ హీరో సుమన్, కీలక పాత్ర పోషించిన భానుచందర్, హీరో-డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్, నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా- సీతారామ్ నాయక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలు ఎమ్.చౌహాన్, సెకండ్ హీరో-హీరోయిన్స్ వినోద్ రైనా, రేఖా నిరోష పాలుపంచుకుని చిత్ర విశేషాలు వెల్లడించారు.
 
బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే "సేవాదాస్" చిత్రంలో నటించడం గర్వంగా ఉందన్నారు సుమన్- భానుచందర్. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా "సేవాదాస్" చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను వారు అభినందించారు. ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న "సేవాదాస్" సంచలన విజయం సాధించడం ఖాయమని హీరో కమ్ డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్ పేర్కొన్నారు.
 
 నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్-బాలు చౌహాన్ మాట్లాడుతూ... "సేవాదాస్" రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. ఏప్రిల్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల వినోద్ రైనా-రేఖా నిరోష సంతోషం వ్యక్తం చేశారు.
ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, అసోసియేట్ డైరెక్టర్స్: రాజేంద్రప్రసాద్ చిరుత-రవితేజ-సంజయ్ భూషణ్-సాయి కుమార్, కో-డైరెక్టర్స్; ఎన్టీఆర్ సుబ్బు-నవీన్, వి ఎఫ్ ఎక్స్: కిషోర్ కాలకూరి, ఆర్ట్ డైరెక్టర్: విజయ్.ఎ, ప్రొడక్షన్ కంట్రోలర్: లక్ష్మణరావు-శ్రీరాములు, కెమెరామెన్: విజయ్ టాగోర్, ఎడిటర్: ప్రదీప్, పోస్ట్ ప్రొడక్షన్: రామానాయుడు స్టూడియోస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్.బాలు చౌహాన్, నిర్మాతలు: ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్, కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్; కె.పి.ఎన్. చౌహాన్!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

Monsoon session: జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Snakes: రైతు ఇంట్లో వందకు పైగా పాములు.. 50 పాముల్ని చంపేశారు.. అసలు సీన్ అక్కడే?

షిల్లాంగ్‌లో కొత్తజంట హనీమూన్, భర్త హత్య-భార్య మిస్సింగ్, పక్కనే కొబ్బరి బొండాం కొట్టే కత్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments