మళ్ళీ రావా" వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా మళ్ళీ మొదలైంది.టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను జీ 5 ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ నెల 11న రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ శనివారంనాడు మీడియా సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు.
- విడాకుల తీసుకున్న జంట కథే అయినా మల్లీ వారి జీవితం ఎలా మళ్ళీ మొదలైంది అనేది సినిమా సారాంశం. చాలా సున్నితమైన అంశాన్ని తీసుకుని ఎంటర్టైన్మెంట్లో చూపించాం.
- తెలుగులో ఇది నా మొదటి సినిమా. 2014లో తమిళంలో ఒక సినిమా చేశాను. ఆ తర్వాత కొన్ని యాడ్స్ చేశాను. బేసిగ్గా నాది చెన్నై. తెలుగులో సినిమా తీయాలనే హైదరాబాద్ షిప్ట్ అయ్యాను.
- మళ్ళీ మొదలైంది సినిమా నిన్ననే ఓటీటీలో వచ్చింది. చూసిన వారంతా చాలా బాగుందని అభినందనలు తెలియజేస్తున్నారు. కొన్నిచోట్ల క్రిటిక్స్ తనశైలిలో స్పందిస్తున్నారు. ఇది ఫ్యామిలీతో చూసే సినిమా.
- సుమంత్‌గారికి నాకు ఓ కామెన్ ఫ్రెండ్ వున్నాడు. తన ద్వారా కథ రాసుకున్నాక సుమంత్ కు సినాప్సిస్ మెయిల్ చేశాను. చదివాక నచ్చి పూర్తి కథ పంపమంటే పంపాను. వెంటనే ఆయన చేస్తానన్నారు. ఇది కేవలం ఆయనకే చెప్పా. ఏ హీరోకు చెప్పలేదు. రియలిస్టిక్‌గా వయస్సురీత్యా కథలోని పాత్రకు ఆయన సరిపోతాడని ఆయనకే చెప్పాను.
- విడాకుల కథ ఫస్ట్ లాక్‌డౌన్‌లోనే రాసుకున్నా. ఈ కథకు స్పూర్తి నా స్నేహితుడు. అతని జీవితంలో విడాకులు, మళ్ళీ పెండ్లి సంఘటనలు జరిగాయి. ఈ సినిమాలో చూపించిన లాయర్ పాత్ర వంటివి మాత్రం సినిమాటిక్‌గా పెట్టాం.
- స్క్రిప్ట్ రాసే క్రమంలో విడాకులు తీసుకున్న కొన్ని జంటలను కలిసి వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. దీన్ని సీరియస్‌గా వద్దు. కామెడీ టచ్‌తో చేయమని సలహాలు ఇచ్చారు.
- ఈ కథ రిస్క్ వుంటుందనే అనుకున్నాం. ఎందుకంటే అన్ని సెక్షన్లకు చేరదు. ఎ,బి ఆడియన్స్‌కు బాగా నచ్చుతుందని భావించాం.
- ఇందులో ఎటువంటి వల్గారిటీ లేదు. హాయిగా కుటుంబంతో చూసే సినిమా. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుని చేశాం.
- ఈ సినిమాను థియేటర్ కోసమే చేశాం. ఎడిటింగ్ పూర్తయ్యాక కనీసం మల్లీప్లెక్‌లోనైనా విడుదల చేద్దామని భావించాం. కానీ కరోనా వల్ల థియేటర్ల ఇబ్బంది కావడంతో ఓటీటీ సేఫ్ అని నిర్మాతలు వెళ్ళారు. జీ5 వారికి నచ్చి మంచి ఆఫర్ ఇచ్చారు.
- ఈ సినిమాను నిన్న చాలామంది స్నేహితులు యు.ఎస్., బెంగుళూరు, చెన్నైలలో చూశారు. బాగా డీల్ చేశామనే అభినందలు తెలిపారు.
- ఈ సినిమాను సుమంత్ ఫ్యామిలీ మెంబర్లతోపాటు ఆయన స్నేహితులు కూడా చూసి బాగుందని ఫీడ్ బేక్ ఇచ్చారు. నాగార్జునగారు ఇంకా చూడలేదు. చూస్తారని అనుకుంటున్నాం.
- నాకు కమర్షియల్ సినిమాలు ఎంటర్టైన్మెంట్లో చేయాలంటే ఇష్టం. అందుకే తగిన కథలు రాసుకున్నా.
- తెలుగు ప్రేక్షకులు లాక్డౌన్ సమయంలో చాలా మారిపోయారు. కంటెంట్ బేస్డ్ సినిమాలనే లైక్ చేస్తున్నారు. ఒకరకంగా మంచి పరిణామం. అందుకే కొత్త కథలు రాసేటప్పుడు వారిని దృష్టిలో పెట్టుకుని రాస్తున్నా.
- నేను తెలుగు, తమిళ, మలయాళం సినిమాలు చూస్తుంటాను. తెలుగులో పుష్ప, అఖండ సినిమాలు చూశాను. భిన్నమైన కంటెంట్‌తో తీసిన చిత్రాలవి అని తెలిపారు.