Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

దేవీ
సోమవారం, 23 జూన్ 2025 (10:38 IST)
Sekhar Kammula, Rashmika, chiru, Janhvi and others
హైదరాబాద్ లో రాత్రి జరిగిన బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ,  ఇది నా సక్సెస్ మీట్ లా అనిపిస్తుంది. అలాంటి ఆనందాన్ని ఇక్కడ పొందుతున్నాను. ఇక్కడ ఉన్నవాళ్లంతా నాకు కావలసిన వాళ్లు. వాళ్ళ మొహంలో ఆనందం చూస్తుంటే ఇది నా సక్సెస్ మీట్ అనిపిస్తోంది. ఇక్కడకి నేను గెస్ట్ గా రాలేదు. మీలో ఒకడిగా, ఆత్మీయుడుగా వచ్చాను. 
 
నాగార్జున ఈ సినిమాకు ముందు ఒకసారి కలిశారు.  కుబేర గురించి అడిగాను. ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ధనుష్ లీడ్ క్యారెక్టర్ అని చెప్పారు. ఎలా ఒప్పుకున్నావు అని అడిగాను. నాకు ఎక్కడో డిఫరెంట్ గా చేయాలని ఉంది. కొత్త గేట్స్ ఓపెన్ చేయాలనిపిస్తుంది అలా ఈ సినిమా ఉపయోగపడుతుందని చెప్పారు. నేను సినిమా చూశాను. ఆయన చెప్పినది 100% కరెక్ట్. ఈ సినిమా తర్వాత తను మరో 40 ఏళ్లు అద్భుతంగా రాణిస్తారనేది వాస్తవం. ఈ క్యారెక్టర్ శేఖర్ రాయడం, అది నాగార్జున  చేయడం ఇదే ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నాను. దేవ క్యారెక్టర్ లో ధనుస్ ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం. ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత అలా అనిపించింది. సినిమా చూస్తున్నప్పుడు ధనుష్ ని గుర్తించలేకపోయాను. అంతలా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ సినిమాని ఒక సినిమాలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లా చూశాను. వాస్తవంగా జరుగుతున్నట్టుగా అనిపించింది. ఒక్కొక్క సినిమాని ఆణిముత్యం లాగా చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నా శేఖర్ కమ్ముల. 
 
స్టేట్ రౌడీ షూటింగ్ జరుగుతున్నప్పుడు శేఖర్ కమ్ముల నన్ను ఓ అభిమానిలా కలిశారు. ఆరోజే  సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు ఇలాంటి ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీసి ప్రేక్షకుల మన్ననలని పొందుతున్న దర్శకుడిగా ఆయన ఉండడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఆయనకి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. శేఖర్ కమ్ముల సినిమాలో వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఈ సినిమాల పాత్రలు కూడా దేవ దీపక్ అనే గుర్తు పెట్టుకుంటాం. నాగ్ అనుకున్నట్లుగా ఇది ఆయనకి మరో డోర్ ఓపెన్ అయింది. మరిన్ని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ ఆయనకి వస్తాయి. ఆయన దోవలో కూడా నేను వస్తానని అనుకుంటున్నాను. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. రష్మిక ఫెంటాస్టిక్ గా పెర్ఫార్మ్ చేసింది. తన ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు నేను గెస్ట్ గా వచ్చాను.  తను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది. తన క్యారెక్టర్ లో ఇంటెన్సిటీ ఈ సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో సమీరా క్యారెక్టర్ చూసినప్పుడు చూడాలని ఉంది లో సౌందర్య గుర్తుకొచ్చింది. ఈ సినిమా మొత్తంలో తన క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉంది.

ఈ సినిమాలో హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ దేవ. ఈ క్యారెక్టర్ కి ధనుష్ తప్ప ఇంకెవరూ చేయలేరు .అంత స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇండియాలో ధనుష్ ఒక్కరే. అంత నేచురల్ గా క్యారెక్టర్ లో ఇమిడిపోయారు. ఈ సినిమాతో తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి.  తనకు అడ్వాన్స్ కంగ్రాజులేషన్స్ చెప్తున్నాను. ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనేదానికి అర్థమే లేదు. తనకి ఈ సినిమాకి అవార్డు వస్తే కనుక ప్రతి ఒక్కరికి గర్వకారణం. సునీల్ గారి నాన్నగారు నారాయణ దాస్ చాలా హానెస్ట్ పర్సన్. ఈ సినిమా బిజినెస్ లో అంత నిజాయితీగా ఉండే వ్యక్తులు మరొకరు లేరు. ఆయన వారసులుగా సునీల్, థర్డ్ జనరేషన్ లో జాన్వి  ముందుకు వెళ్లడం అనేది చాలా ఆనందంగా ఉంది. 
 
జాన్వి తో ఒక సినిమా చేస్తాను. వారు కుబేర లాంటి మరెన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. డిఓపి నికేత్ ఫెంటాస్టిక్ జాబ్. సినిమా చాలా రిచ్ గా ఉంది. ఇక్కడ యంగ్స్టర్స్ ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలంటే ఇలాంటి యంగ్స్టర్స్ రావాలి. ఇదే ఎనర్జీతో ఇండస్ట్రీ కళకళలాడాలని కోరుకుంటున్నాను. దేవిశ్రీప్రసాద్ నా బిడ్డ లాంటివాడు. నా కం బ్యాక్ లో కూడా అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చాడు. తన ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది. దేశం మొత్తం తనని కీర్తిస్తోంది. 
 
సినిమా చాలా మ్యూజికల్ గా ఉంది. అది దేవిశ్రీ రికార్డింగ్ లో అద్భుతం చేశాడు. ఇందులో తల్లి మీద పాడిన పాట ఖైదీ 150 లో నీరు నీరు పాటని మైమరిపించే లాగా అనిపించింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సినిమాలు రావాలి. సినిమా సక్సెస్ గగనం అయిపోతున్న రోజులువి. థియేటర్స్ కి ఆడియన్స్ రప్పించడం గగనం అయిపోతున్న రోజులు ఇవి. ఇలాంటి సమయంలో ఇలాంటి కంటెంట్ వుంటే  ఆడియన్స్ ధియేటర్స్ కి వస్తారని భరోసా కల్పించిన సినిమా ఇది.ఈ క్రెడిట్ శేఖర్ కమ్ములకే దొరుకుతుంది. కంటెంట్ బాగుంటే హ్యూమన్ ఎమోషన్స్ ని టచ్ చేయగలిగితే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారని కుబేర సినిమా నిరూపించింది. టీంకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. లవ్ యు ఆల్'అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Assembly bypoll results: గుజరాత్, పంజాబ్, కేరళ, బెంగాల్‌ ఉప ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు మొదలు

ఆపరేషన్ సింధు - ఇరాన్ నుంచి స్వదేశానికి వచ్చిన 311 మంది ఇండియన్స్

Damascus church: డమాస్కస్‌లోని చర్చిపై ఆత్మాహుతి బాంబర్ దాడి: 19మంది మృతి

దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందా? కేంద్ర పెట్రోలియం మంత్రి ఏమంటున్నారు?

దళితులకు అరగుండు చేసి.. బలవంతంగా మురుగు నీరు తాగించారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments