Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

Advertiesment
Sekhar Kammula

దేవీ

, శనివారం, 21 జూన్ 2025 (19:28 IST)
Sekhar Kammula
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, శేఖర్ కమ్ముల  సినిమా 'కుబేర'. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై  యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
 
డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, ఈ సినిమా కథ పుట్టినప్పటినుంచి చాలా డిఫరెంట్ గా చేద్దాం, హాలీవుడ్ స్థాయిలో తీద్దాం, రియల్ లొకేషన్స్ లో చేద్దాం, ముంబైని కొత్తగా చూపిద్దామని ఆశ. నాగార్జున గారి దగ్గరికి అదే ఆశతో వెళ్ళాము. చాలా డిఫరెంట్గా తీద్దామని అని ఆయనకి చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. ఆయన అద్భుతంగా చేశారు. ఈ జర్నీలో మాకు ఆయన ఎంతో ధైర్యాన్ని నింపి ముందుకు నడిపారు. 
 
అలాగే ధనుష్ గారు కూడా. ఇది సామాన్యమైన సినిమా కాదు. సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా అని ప్రీరీలీజ్ ఈవెంట్లో చెప్పాను. అది ఈరోజు నిజమైంది. నేను చేసిన సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, హానెస్ట్, ట్రూ ఫిలిం. ఇంత కొత్తగా జెన్యూన్ గా సినిమా తీసినప్పుడు ఇందులో చాలా లేయర్స్ చెప్పడానికి ప్రయత్నించాను. ఆ క్రమంలో కాస్త లెంత్ ఉండవచ్చు. 
 
ఈ సినిమాని మీరు మరోసారి చూసినప్పుడు మీకు తెలియని లేయర్స్ కూడా కొత్తగా కనిపిస్తాయి. సినిమా తగ్గించాలని డైరెక్టర్ కి గాని,  టీం కి గాని తెలియని విషయం కాదు.  కానీ ఇది చెప్పాల్సిన విషయం. కచ్చితంగా చెప్పి తీరాలి. ఒక పాయింట్ ని నిజాయితీగా చెప్పడమే మా ధర్మం. ఇప్పుడు మీరు ఇచ్చిన యునానిమిస్ రిపోర్ట్ తో చాలా ప్రౌడ్ గా ఉంది. ఈ స్థాయి మీరు ఇచ్చారని భావిస్తున్నాను. ఈ సినిమాకి గొప్ప స్థాయి ఇచ్చిన మీడియా కి, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాగర్జున, ధనుష్ గారి పర్ఫార్మెన్స్ కి థియేటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. చాలా మంచి టేకింగ్.. డైరెక్షన్..ప్రొడక్షన్.. అన్నిటి గురించి ప్రేక్షకులు చాలా గొప్పగా మాట్లాడుతున్నప్పుడు చాలా గర్వంగా ఆనందంగా అనిపిస్తోంది. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. ఇది ఒక కంప్లీట్ ఫిలిం'అన్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్