Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

దేవీ
సోమవారం, 23 జూన్ 2025 (10:28 IST)
Dhanush- Chiru
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల 'కుబేర' తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్  బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
 
ముందుగా హీరో ధనుష్ రాగానే చిరంజీవిగారి కాళ్ళకు నమస్కరిస్తూ ఆశీస్సుల అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ .. ఒక అద్భుతమైన రోజు. ఇలాంటి రోజు కోసమే ప్రతి ఆర్టిస్ట్ ఎదురుచూస్తారు. ఇలాంటి రోజుల్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక సినిమాకి యునానిమస్ గా అద్భుతమైన రెస్పాన్స్ రావడం అనేది చాలా అరుదు. అది ఈ సినిమాకి జరిగింది. ఈ విషయంలో మేమంతా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ దేవుడిచ్చిన సక్సెస్ గా భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ సినిమాని గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు అభిమానులకు ధన్యవాదాలు. యాక్షన్, బ్లాస్టింగ్స్ ఉన్న సినిమాలే థియేటర్స్ లో ఆడుతున్నాయని అలాంటి సినిమాలకే థియేటర్స్ జనాలకి వస్తున్నారని ఒక వాదన ఉంది. కానీ దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా కొత్త నమ్మకాన్ని ఇచ్చారు. హార్ట్ ఫుల్ గా సినిమా తీస్తే ఆడియన్స్ ని ధియేటర్స్ కి తీసుకురావచ్చు అనే హోప్ ని ఆయన ఇచ్చారు. ఎమోషన్ అనేది బిగ్గెస్ట్ గ్రాండియర్.  హ్యూమన్ ఎమోషన్స్ కంటే పెద్ద గ్రాండియర్ ఏది ఉండదు.  తమిళ్ లో ఈ సినిమా చాలా అద్భుతంగా ఆడుతోంది. ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 
 
దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది. ముందు నిర్మాత మొహంలో ఆనందం చూసి సినిమా ఎంత సక్సెస్ అయిందో చెప్పొచ్చు అని మా నాన్న చెప్పేవారు. మా నిర్మాతలు ఆనందంగా ఉండడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. చిరంజీవి గారు వచ్చి మా టీం కి బ్లెస్సింగ్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది మెగా సక్సెస్. చిరంజీవి గారు నాగార్జున గారి సమక్షంలో మాట్లాడడం అనేది ఒక గొప్ప బ్లెస్సింగ్ భావిస్తున్నాను. సినిమాని నెక్స్ట్ లోనికి తీసుకెళ్లి ఆడియన్స్ కి చేరువ చేసిన మీడియాకి థాంక్యూ. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments