Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ల అన్నీ మంచి శకునములే నుంచి సెకండ్ సింగిల్

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (17:45 IST)
Malavika Nair,
ఈ వేసవిలో, పూర్తి వినోదాన్ని అందించడానికి సంతోష్ శోభన్, మాళవిక నాయర్  నటిస్తున్న ‘అన్నీ మంచి శకునములే’ థియేటర్ లోకి వస్తోంది. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ చాలా ఆకర్షణీయంగా ఉంది. టీజర్, టైటిల్ సాంగ్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. శ్రీరామ నవమి శుభ సందర్భంగా మేకర్స్ రెండవ సింగిల్ ‘సీతా కళ్యాణం’ పాటని విడుదల చేశారు.
 
శ్రీరామ నవమి వేడుకకు తగిన పాట సీతా కళ్యాణ వైభోగమే. పాటంతా ఒక పండగలా వుంది. ఈ సీజన్‌లో పెళ్లి పాటగా అలరించబోతుంది.  విజువల్స్ వివాహ వేడుకలను అద్భుతంగా చూపించాయి. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ ఆహ్లాదకరమైన పాటను చిత్రీకరించడంలో నందిని రెడ్డి మరోసారి తన మార్క్ చూపించారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించగా, చైత్ర అంబడిపూడి , శ్రీకృష్ణ  ఎంతో మధురంగా ఆలపించారు. స్క్రీన్‌పై పూర్తి విజువల్స్‌తో పాట మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
 
ఈ  చిత్రంలో రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, సౌకార్ జానకి, వాసుకి ..పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
 మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దావూద్ స్క్రీన్ ప్లే అందించగా, లక్ష్మీ భూపాల మాటలు అందించారు. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
 సమ్మర్‌లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్‌లో ఒకటిగా మే 18న సినిమాను విడుదల చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments