Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఎమోషన్ తెలుగు సినిమాల్లో చూడలేదు : శ్రీనివాస్ అవసరాల

PAPA team
, శుక్రవారం, 17 మార్చి 2023 (07:14 IST)
PAPA team
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని  సినిమా విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసిన చిత్ర బృందం.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 17న  ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించి.. చిత్ర విజయం పట్ల వారికున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలు చెప్పారు.
 
ప్రశ్న: దర్శకుడిగా 'ఊహలు గుసగుసలాడే' నుంచి ఇప్పటికి శ్రీనివాస్ అవసరాల గారిలో ఎలాంటి మార్పులు వచ్చాయి?
నాగశౌర్య: ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడే అలాగే ఉన్నాయి. ముందే స్క్రిప్ట్ ఇచ్చి చదవమంటారు. ఆయనకు ఏం కావాలి, ఏం చేయాలి అనేది దానిపై చాలా స్పష్టత ఉంటుంది. నేను ఆయన ద్వారానే పరిచయమయ్యాను. ఆయన రాసే ప్రతి డైలాగ్ ఎలా పలకాలో నాకు తెలుసు. అప్పటికి ఇప్పటికి నేను ఆయనలో ఎలాంటి మార్పు చూడలేదు.
 
ప్రశ్న: శ్రీనివాస్ అవసరాల గారితో ఇది మూడో సినిమా.. విజయం పట్ల నమ్మకంగా ఉన్నారా?
నాగశౌర్య: చాలా నమ్మకంగా ఉన్నాను. ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. నా కెరీర్ లో 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' సినిమాలు ఉన్నాయని ఎలా చెప్పుకుంటున్నానో.. అలా చెప్పుకోగలిగే సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి.
 
ప్రశ్న: శ్రీనివాస్ గారు ఈ సినిమాలో మీరు కూడా నటించారు కదా.. మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
శ్రీనివాస్ అవసరాల: ఈ చిత్రంలోని పాత్రలన్నీ మనం నిజ జీవితంలో చూసినట్లుగా సహజంగా ఉంటాయి. ఇది ఊహలు గుసగుసలాడే లాంటి సరదాగా సాగిపోయే సినిమా కాదు.. ఎమోషనల్ గా సాగే సినిమా.
 
ప్రశ్న: సింక్ సౌండ్ ప్రయత్నించడానికి కారణమేంటి?
శ్రీనివాస్ అవసరాల: ఆ విషయంలో ముందుగా వివేక్ గారికి థాంక్స్ చెప్పాలి. నేను మొదటి నుంచి సింక్ సౌండ్ కావాలని పట్టుబట్టాను. ఎందుకంటే ఇది నటన మీద ఆధారపడిన సినిమా. డబ్బింగ్ చెప్తే కృత్రిమంగా ఉంటుంది అనిపించింది. సినిమా అంతా సహజంగా ఉండాలన్న ఉద్దేశంతో సింక్ సౌండ్ చేయాలని నిర్ణయించుకున్నాం.
 
ప్రశ్న: దర్శకుడిగా మీ మూడో సినిమాని కూడా నాగశౌర్యతో చేయడానికి కారణం?
శ్రీనివాస్ అవసరాల: నేను ముందుగా కథ రాసుకొని ఆ తరువాత పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంచుకుంటాను. ఈ సినిమా చూసిన తరువాత సంజయ్ పాత్రలో శౌర్యను తప్ప ఎవరినీ ఊహించుకోలేము. అంతలా ఆ పాత్రలో ఇమిడిపోయాడు. ఈ పాత్రకు శౌర్య సరిపోతాడని నేను ముందే నమ్మి ఎంచుకున్నాను.
 
ప్రశ్న: ఈ సినిమాలో ఏడు చాప్టర్ లు ఉన్నాయి కదా.. మీకు బాగా నచ్చిన చాప్టర్ ఏది?
శ్రీనివాస్ అవసరాల: ప్రతి చాప్టర్ లోనూ రకరకాల భావోద్వేగాలు ఉంటాయి. ప్రతి చాప్టర్ మరో చాప్టర్ తో ముడిపడి ఉంటుంది. నాకు ఇందులో నాలుగో చాప్టర్ చాలా ఇష్టం. అందులో ఇంద్రగంటి మోహనకృష్ణ గారు పాడిన పాట ఉంటుంది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఈ చాప్టర్ లో ఎమోషన్ ఇంతవరకు నేను తెలుగు సినిమాల్లో చూడలేదనేది నా అభిప్రాయం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ్యారేజ్ ఫంక్షన్‌లో స్మోక్ చేసిన లైగర్ హీరోయిన్.. నెట్టింట ఫోటోలు వైరల్