Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్యదేవ్ యాక్షన్ మూవీ కృష్ణమ్మ రిలీజ్ డేట్ ఫిక్స్

డీవీ
శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (16:25 IST)
Satyadev - Krishnamma
సత్యదేవ్.. హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించు కున్నారు. పక్కా కమర్షియల్‌ సినిమా అయినా, ఎక్స్ పెరిమెంటల్‌ మూవీ అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్‌ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్‌. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే 10న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
 
వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను విడుదల చేస్తున్నాయి.
 
‘కృష్ణమ్మ’ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించారు.   లక్ష్మణ్‌, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో నటించారు.ఇప్పటికే విడుదలైన ‘కృష్ణమ్మ’ మూవీ టీజర్, టైటిల్ సాంగ్, ఏమవుతుందో మనలో.., దుర్గమ్మ అనే లిరికల్ సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. సత్యదేవ్‌ని సరికొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రంగా ‘కృష్ణమ్మ’ నిలవనుంది. ఈ సినిమాకు కాల భైరవ సంగీతాన్ని, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
 
నటీనటులు:సత్యదేవ్, అతీరా రాజ్, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్, కృష్ణ, అర్చనా అయ్యర్  తదితరుల

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా అమ్మకు కట్లపొడి, ఆకులు ఇష్టం.. ఉచిత బస్సులో వెళ్తున్నా.. వీడియో వైరల్

Lancet Study: భారత్‌ను వణికిస్తున్న మధుమేహం.. 10మందిలో నలుగురికి ఆ విషయమే తెలియదు!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబడదు.. పల్లా శ్రీనివాసరావు

అమరావతి గురించి ఏడవడం ఆపండి.. వైకాపా నేతలకు కౌంటరిచ్చిన నారాయణ

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో కుప్పకూలిపోయిన యువకుడు.. ఆ తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments