Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సత్యదేవ్, డాలీ ధనంజయ కాంబోలో క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా జీబ్రా

Advertiesment
Satyadev, Dolly Dhananjaya, Ishwar Karthik
, శనివారం, 18 నవంబరు 2023 (16:55 IST)
Satyadev, Dolly Dhananjaya, Ishwar Karthik
హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కథానాయకులుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్  క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జీబ్రా. లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌.. అన్నది ట్యాగ్ లైన్. పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పతాకాలపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్.పద్మజ,బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిసినాటో హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రముఖనటులు సత్యరాజ్, సునీల్, గరుడ రామ్, రామరాజు ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
ఇదివరకు ఎన్నడూ చూడని ఆర్ధికనేరాల నేపధ్యంలో యధార్ధ సంఘనట స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సత్యదేవ్, డాలీ ధనంజయ తో పాటు చిత్ర యూనిట్ అంతా కేక్ కట్ చేసి వ్రాప్ అప్  పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.  
 
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్‌ సంగీతం ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. శ్రీ లక్ష్మి,సహ నిర్మాతగా వున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ సత్య పొన్మార్. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్.
 
ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.
 
తారాగణం: సత్యదేవ్, డాలీ ధనంజయ, ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిసినాటో, సత్యరాజ్, సునీల్, గరుడ రామ్, రామరాజు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాంఛనంగా ప్రారంభమైన కార్తీక్ రాజు సినిమా హస్తినాపురం