Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో విషాదం.. రీమేక్ స్పెషలిస్ట్ సతీష్ కౌశిక్ మృతి

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (10:51 IST)
Satish Kaushik
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ సతీష్ కౌశిక్ మృతి చెందారు. బాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నటుడు అయిన సతీష్ కౌశిక్ గుండెపోటుతో గురువారం ప్రాణాలు కోల్పోయారని  స‌తీష్ కౌశిక్ మ‌ర‌ణ‌వార్త‌ను అత‌డి ప్రాణ స్నేహితుడు, న‌టుడు అనుప‌మ్ ఖేర్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. 
 
మూడు దశాబ్ధాల సినీ ప్రయాణంలో నటుడిగా వందకు పైగా సినిమాలు చేశారు సతీష్. అలాగే దర్శకుడిగా 15 సినిమాలకు పైగా రూపొందించారు. అనిల్ క‌పూర్‌, శ్రీదేవి జంట‌గా న‌టించిన రూప్ కి రాణి చోరోంకా రాజా సినిమాతో ద‌ర్శ‌కుడిగా స‌తీష్ కౌశిక్ కెరీర్ ఆరంభ‌మైంది. ఇటీవ‌ల ఓటీటీలో రిలీజైన ఛ‌త్రివాలీ అత‌డు న‌టించిన చివ‌రి సినిమా కావ‌డం గ‌మ‌నార్హం.  
 
అలాగే స‌తీష్ కౌశిక్ కామెడీ టైమింగ్‌కు మంచి పేరు రావ‌డంతో న‌టుడిగానూ రాణించారు. మిస్ట‌ర్ ఇండియాలో క్యాలెండ‌ర్‌గా, దీవానా మ‌స్తానాలో ప‌ప్పు పేజ‌ర్‌గా స‌తీష్ కౌశిక్ క్యారెక్ట‌ర్స్ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నిలిచిపోయాయి. క‌మెడియ‌న్‌గా, విల‌న్ అసిస్టెంట్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప‌లు సినిమాల్లో వైవిధ్య‌మైన న‌ట‌న‌తో మెప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, HUDCO సాయం.. ఏపీ సర్కారు

International Mind-Body Wellness Day 2025: ఒత్తిడి నుంచి గట్టెక్కాలి.. అప్పుడే ఇవన్నీ..? (video)

అన్న భార్య వదినను చంపి ఆమె మృతదేహంపై అత్యాచారం చేసిన కామాంధుడు

cockfight: సంక్రాంతి కోడిపందేలు.. ఏర్పాట్లు పూర్తి.. రూస్టర్స్ కోసం ప్రత్యేక మెను

Facebook : ప్రేమ కోసం పాకిస్థాన్‌ బార్డర్ దాటితే.. ప్రేయసి షాకిచ్చింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments