గుండెపోటు. ఈ సమస్యతో రోజూ ఎక్కడో ఒకచోట చనిపోతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన 24 ఏళ్ల వైద్య విద్యార్థిని గుండెపోటుతో చనిపోయారు. వివరాలు ఇలా వున్నాయి. నిజమాబాద్ మల్కాపూర్‌లో గ్రామ ఉపసర్పంచి వెంకటరెడ్డి పెద్దకుమారుడు అరుణ్ రెడ్డి కెనడాలో స్థిరపడ్డారు. బీడీఎస్ పూర్తి చేసిన అరుణ్ రెడ్డి సోదరి పూజిత రెడ్డి ఈ ఏడాది జనవరిలో కెనడా వెళ్లారు. అక్కడే వారం రోజుల పాటు వున్న తర్వాత యూనివర్శిటీ హాస్టలులో చేరారు.
పదిరోజుల క్రితం హఠాత్తుగా ఆమెకి గుండెపోటు వచ్చి హాస్టలు గదిలో కుప్పకూలారు. దీనితో హుటాహుటిన ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలో కోల్పోయారు. ఆమె మృతదేహాన్ని సోదరుడు స్వగ్రామానికి తీసుకుని వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఉన్నత చదువులకోసం వెళ్లి నిర్జీవంగా మారిన కుమార్తెను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.