Webdunia - Bharat's app for daily news and videos

Install App

#SarangaDariya​​ పాటకు చిక్కు.. సాయిపల్లివి తలనొప్పి..(Video)

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (11:48 IST)
సాయిపల్లవి పాటలు యూట్యూబ్‌లో రికార్డ్ సృష్టిస్తున్నాయి. వచ్చిండే, రౌడీ బేబీ పాటలు ఇప్పటికే ట్రెండ్ సెట్ చేశాయి. ఈ కోవలోనే ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా పాట గత వారం రోజులుగా యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తోంది. ప్రేక్షకులు కూడా ఈ జానపద గేయానికి జై కొడుతున్నారు. అయితే ఈ పాటపై ఇప్పుడు వివాదం చెలరేగుతోంది.
 
సాధారణంగా జానపద గేయాలు సినిమాలో తీసుకున్నప్పుడు ఒరిజినల్ సింగర్ నుంచి అనుమతి తీసుకోవాలి. వాళ్లకు క్రెడిట్స్‌ ఇవ్వాల్సిందే. లేదంటే చిక్కులు తప్పవు. ఇప్పుడు 'సారంగ దరియా..' పాటపై కూడా ఇలాంటి వివాదమే మొదలైంది. పల్లెల్లో ఉన్న ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చింది తానేనంటూ మీడియా ముందుకొచ్చింది కోమలి అనే జానపద గాయని. సారంగదరియా పాట అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానని.. ప్రజలకు చేరువ చేసింది తాను కాబట్టి ఈ సాంగ్‌ తన సొంతమని చెప్తుంది ఈమె.
 
అప్పట్లో స్టార్ మాలో వచ్చిన రేలారే రేలా ప్రోగ్రాం సమయంలో సుద్దాల అశోక్‌ తేజ తన పాట విన్నాడని.. ఇప్పుడు లవ్‌ స్టోరీలో ఈ పాటను వాడుకున్నారని తెలియగానే అశోక్‌ తేజకు ఫోన్‌ చేశానని చెప్పింది కోమలి. ఇది ఎవరి సొంతం కాదు.. నువ్వు పుట్టక ముందే ఈ పాట నా దగ్గరుంది అని చెప్పాడని చెప్పుకొచ్చింది. కానీ ఈ పాటను ఆయన ఎప్పుడూ వెలుగులోకి తీసుకురాలేదని తెలిపింది. 
 
సినిమాలో ఈ పాట తనతో పాడించనందుకు బాధేసిందని.. తన బాధను చూసి నెక్స్ట్‌ సినిమాలో అవకాశం ఇస్తానని శేఖర్‌ కమ్ముల హామీ ఇచ్చారని చెప్పింది కోమలి. కానీ ఈ పాట విషయంలో తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఇవ్వాల్సిన పేరు ఇవ్వలేదని కోమలి మీడియా ముందు చెప్పింది. మరి ఈ వివాదానికి సాఫ్ట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎలా ఫుల్ స్టాప్ పెడతాడో చూడాలి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments