Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్చి 11న జాతి రత్నాలు చూసి ఎంజాయ్ చేయండిః విజ‌య్ దేవ‌ర‌కొండ

మార్చి 11న జాతి రత్నాలు చూసి ఎంజాయ్ చేయండిః విజ‌య్ దేవ‌ర‌కొండ
, ఆదివారం, 7 మార్చి 2021 (23:42 IST)
Jaatiratnalu team, vijay
జాతి ర‌త్నాలు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి వ‌రంగ‌ల్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌ను, ప్ర‌జ‌ల‌ను ఉత్సాహ‌ప‌రిచారు. ఆయ‌న మాట్లాడుతూ, ‘కాకతీయ..వరంగల్..ఇక్కడున్న ప్రతీ ఒక్కరికీ.. అక్కడున్న ప్రతీ ఒక్కరికీ..మీ అందరూ కనిపిస్తున్నారు..ఐ లవ్యూ ఆల్.. ఈ రోజు మార్నింగ్ నాగీ నుంచి మెసెజ్ వచ్చింది.. సినిమా పూర్తి అయింది.. నువ్ త్వరగా రావాలి అన్నాడు. ఇక్కడికి రావడం నాకెంతో సంతోషంగా ఉందని అన్నాను. ఇంత మందిని కలిసే అవకాశం వచ్చింది. ఏడాది నుంచి మీ అందరినీ చూడలేదు..ఈరోజు నేను నటుడిని కాలేకపోయినా ఇక్కడకి వచ్చేవాడిని.. మీలా అక్కడ కూర్చుని చూసేవాడిని.. యాక్టర్‌ని అయ్యాను కాబట్టి ఇక్కడ నిల్చున్నా. 
 
నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ సినిమాను సంవత్సరం పాటు రిలీజ్ చేయకుండాఉంచుకున్నాం. ఇలాంటి ఫీలింగ్ కోసమే రెండేళ్లు మా దగ్గరే పెట్టుకున్నాం. ఇప్పుడు థ్యాంకింగ్ ప్రోగ్రాం పెట్టొద్దని అనుదీప్ అన్నాడు. రాహుల్, దర్శి, రధన్, ఫరియా కొన్ని సినిమాలు అలా కలిసి వస్తాయ్. నవీన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలు చేసినా వాటికి తగ్గట్టు ఉంటాడు. ఏజెంట్ పాత్ర చేస్తే ఏజెంట్‌లా జోగిపేట కుర్రాడిలా ఇలా ఏ పాత్ర చేసినా అలానే కనిపిస్తాడు. విజయ్ కూడా అంతే.. ఒకే నాణెనికి రెండు వైపులున్నట్టు ఉంటారు. ఈవెంట్‌కు వచ్చినందుకు థ్యాంక్స్ విజయ్. ఏసీపీ జితేందర్ గారికి ధన్యవాదాలు. ఇంత పెద్ద ఈవెంట్‌ను జాగ్రత్తగా నిర్వహించినందుకు థ్యాంక్స్’ అని ఆయనకు శానిటైజ్డె బొకేను అందించారు. ఇక డైరెక్షన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ సినిమా కోసం పని చేసిన వారందరి గురించి నాగ్ అశ్విన్ వివరించారు.
 
webdunia
Naveen, Vijay
నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో మొదలైన ప్రయాణం.. ఈ జాతిరత్నాలు వరకు వచ్చింది.. ప్రభాస్ అన్నతో డార్లింగ్ రత్నాలు అయ్యింది.. ఇప్పుడు విజయ్ రావడంతో డార్లింగ్ రౌడీ రత్నాల ఫ్యామిలీలా మారిపోయింది. ఎక్కడో యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడిని.. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాం.. ఇది మీ సినిమా యూత్ సినిమా. పోస్టర్‌లో జాతి రత్నాలు అంటే మేం కనిపిస్తున్నాం.. కానీ నాగ్ అశ్విన్, స్వప్నా, ప్రియాంక అసలు రత్నాలు.. హీరో అవుదామని అనుకుని ఇక్కడికి వచ్చాం.. కానీ ఎవరు కలవాలి.. ఎవరి దగ్గరకు వెళ్లాలి.. ఏ స్టూడియోల చుట్టూ తిరిగి.. ఎక్కడ కాంటాక్ట్ చేయాలి ఏమీ తెలియవు.. మా అందరికీ ఓ ఫ్లాట్ ఫాం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్లందరికీ థ్యాంక్స్. అనుదీప్, రదన్, చిట్టీ సాంగ్‌ను ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి అందరికీ థ్యాంక్స్. మా జానే జిగర్.. విజయ్ నేను థియేటర్ వర్క్ షాప్‌లో పదేళ్ల క్రితం కలుసుకున్నాం. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన మా విజయ్. ఆ జర్నీ నుంచి మా సినిమా ఫంక్షన్‌కు గెస్ట్‌గా రావడం నా లైఫ్‌లో చాలా మెమరబుల్ మూమెంట్.. ఈ సినిమా నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాలి.. లాక్డౌన్‌లో ఓటీటీ నుంచి ఎన్ని డీల్స్ వచ్చినా కూడా భద్రంగా కాపాడారు.. థియేటర్లో ప్రేక్షకులు నవ్వుకుంటూ ఉంటే చూడాలని ఎంతో భద్రంగా కాపాడారు. ఎన్ని కష్టాలున్నా ఓ ఐదు నిమిషాలు నవ్వుకుంటే.. లైఫ్ నేను అనుకున్నంత బ్యాడ్‌గా లేదేమో అనే ధైర్యాన్ని నవ్వు ఇస్తుంది.. ఆ నవ్వును మీకు పంచేందుకు మార్చి 11న మేం వస్తున్నాం.. జాతి రత్నాలు సినిమాతో ఎంజాయ్ చేద్దామ’ని అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సినిమాలో కొట్లాడి మ‌రీ నాకు రోల్ ఇచ్చాడు. ఈస్థాయికి కార‌ణం త‌నేః విజ‌య్ దేవ‌ర‌కొండ