Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు ఆడియెన్స్ టూ మచ్ అబ్బాః విజయ్ దేవ‌ర‌కొండ

తెలుగు ఆడియెన్స్ టూ మచ్ అబ్బాః విజయ్ దేవ‌ర‌కొండ
, ఆదివారం, 7 మార్చి 2021 (23:01 IST)
Vijay devarakonda-warngal
నవీన్ పోలిశెట్టి - రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ప్రధాన పాత్రలతో రూపొందిన‌ చిత్రం 'జాతిరత్నాలు`. అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ నిర్మాత‌గా ప‌రిచ‌య మ‌వుతున్నారు.  ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్బంగా జాతి ర‌త్నాలు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వ‌రంగ‌ల్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ముఖ్య అతిథిగా హాజ‌రై జాతిర‌త్నాలు బిగ్ టికెట్ ఆవిష్క‌రించారు.

webdunia
Warangal event
అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, లాక్డౌన్ సమయంలో భయం వేసింది. ఈ ప్యాండమిక్‌లో మళ్లీ సినిమాలకు వస్తారా. చూస్తారా అని మేమంతా మాట్లాడుకున్నాం. మీరు మాకెంత ముఖ్యమో ఈరోజు తెలుస్తోంది. సినిమా అంటే ఒక ఎకానమీ.. ఓ డైరెక్టర్ కథ రాస్తే. నిర్మాత ఓకే చేసి. హీరో సైన్ చేస్తే. యాక్టర్ స్టాఫ్.. లైట్స్ మెన్.. మ్యూజిక్ డైరెక్టర్.. మ్యూజిషియన్స్.. డ్రైవర్లు,  క్యాస్టూమ్ డిజైనర్లు ఇలా అందరూ సినిమా మీద ఆధారపడి ఉన్నాం.. బాంబేకి వెళ్లినా అక్కడి వారు మన గురించి మాట్లాడతారు. తెలుగు ఆడియెన్స్ టూ మచ్ అబ్బా.. ఏం సినిమాలు చూస్తారు.. ఎంత ప్రేమిస్తారు..అని అంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారు.. ఈవెంట్ అని చెబితే వేల మంది వస్తారు.. మాకు గురించి తిక్క తిక్కగా మాట్లాడితే కొట్లాడతారు అని చెబుతాను. నేను మిడిల్ క్లాస్ ఫండ్ అంటే మీరే వచ్చి చేశారు.. బర్త్ డే ట్రక్ ఐదు రాష్ట్రాల్లో చేద్దామంటే.. మీరు వచ్చి అన్ని రాష్ట్రాల్లో చేస్తామని అన్నారు..ఇన్ని సినిమాలు, ఇన్ని హిట్లు.. ఇన్ని ప్యాన్ ఇండియా అనౌన్స్‌మెంట్లు.. ఇంత క్రౌడ్ ఎక్కడైనా ఉంటుందా? తెలుగు వాళ్లను బీట్ చేసే ఆడియెన్స్. ఫ్యాన్స్ ఎక్కడా లేరు.. కాలర్ ఎగరేసి చెబుతున్నా.. ఈ రోజు ఈ అవకాశాన్ని ఉపయోగించి ఇది చెప్పాలని అనుకున్నాను` అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"ఆచార్య" నుంచి మరో లీక్... ఏంటది?