Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

డీవీ
శుక్రవారం, 24 జనవరి 2025 (17:25 IST)
Sanyukta in Akhanda 2
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ-2 తాండవం రూపుదిద్దుకుంటోంది. ఇటీవలే మహాకుంభ మేళాలో షూటింగ్ జరుపుకుని వచ్చారు. ప్రస్తుతం ఫిలింసిటీలో కొంతపార్ట్ చిత్రీకరణ జరుగుతోంది. కాగా, ఈరోజు నాయికగా సంయుక్తను ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అనంతరం ఈ సినిమా ఈనెలాఖరున ఆంధప్రదేశ్ లోని చందర్లపాడులో క్రిష్ణానది తీరంలో చిత్రీకరణ చేయనున్నారు.
 
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' నాల్గవ కాంబినేషన్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. తన హీరోయిన్స్ ని అద్భుతమైన పాత్రల్లో చూపించే  బోయపాటి శ్రీను, సంయుక్తను చాలా క్రూషియల్ క్యారెక్టర్ లో చూపించనున్నారు.
 
ఇదిలా వుండగా, ఈ సినిమా షూటింగ్‌ కోసం బోయపాటి శ్రీను తన బృందంతో కలిసి పరిశీలించారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు పరిసర ప్రాంతాల్లోని కృష్ణానది వద్ద జరపటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడి గుడిమెట్ట గ్రామం వద్ద కృష్ణానది తీరాన్ని పరిశీలించిన బోయపాటి శ్రీను అక్కడి వసతులు, షూటింగ్‌కు ఉన్న వనరులను పర్యవేక్షించారు. కృష్ణానదిలో బోటుపై షికారు చేశారు. నదిలో పరిస్థితిని పరిశీలించారు. గుడిమెట్ల గ్రామస్తులతో కూడా కొద్దిసేపు ముచ్చడించారు.  దసరా కానుకగా సెప్టెంబర్‌ 25న ఈ సినిమా విడుదల కానుంది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్.
 
బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరికీ పాన్ ఇండియా స్థాయిలో మేడిన్ మూవీ అఖండ 2 ఇండియా అంతటా విడుదల కానుంది. సెప్టెంబర్ 25, 2025న దసరా సందర్భంగా థియేటర్లలోకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments