Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

డీవీ
శుక్రవారం, 24 జనవరి 2025 (17:00 IST)
Payal Rajput
‘ఆర్ఎక్స్ 100,  ‘మంగ‌ళ‌వారం’ మూవీతో మ‌న‌సు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.. ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. 6 భాష‌ల్లో  ‘వెంక‌ట‌ల‌చ్చిమి’గా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాత‌లుగా, డైరెక్ట‌ర్ ముని ద‌ర్శ‌క‌త్వంలో  పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌నున్న ‘వెంక‌ట‌ల‌చ్చిమి’ మూవీ హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.
 
Venkatalacchimi opeing shot
ఈ సంద‌ర్బంగా డైరెక్ట‌ర్ ముని మాట్లాడుతూ.. ‘‘వెంక‌ట‌ల‌చ్చిమి’గా క‌థ అనుకున్న‌ప్పుడే పాయల్ రాజ్‌పుత్ స‌రిగ్గా స‌రిపోతార‌నిపించింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెర‌కెక్కిస్తున్నాం. ట్రైబల్ గర్ల్  యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన‌ ఈ రివేంజ్ డ్రామా ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయం’’ అని అన్నారు.
 
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘‘మంగ‌ళ‌వారం’ సినిమా త‌ర్వాత ఎన్నో క‌థ‌లు విన్నాను. న‌చ్చ‌క‌ రిజెక్ట్ చేశాను. డైరెక్ట‌ర్ ముని గారు ‘వెంక‌ట‌ల‌చ్చిమి’ క‌థ చెప్ప‌గానే చాలా న‌చ్చేసింది. ఈ సినిమా త‌ర్వాత నా పేరు ‘వెంక‌ట‌ల‌చ్చిమి’గా స్థిర‌ప‌డిపోతుందేమో అన్నంత‌గా బ‌ల‌మైన స‌బ్జెక్టు ఇది. నా కెరీర్‌కి నెక్ట్స్ లెవ‌ల్‌గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుంద‌నే న‌మ్మ‌కం ఉంది.’’ అని అన్నారు.
 
యూత్ ఆడియ‌న్స్‌కు హాట్ ఫేవ‌రేట్ హీరోయిన్‌గా మారిపోయింది పాయల్ రాజ్‌పుత్. ఈసారి డిఫరెంట్ కాన్సెప్టు, ఛాలెంజింగ్ రోల్‌తో ఈ పాన్ ఇండియా సినిమా చేయ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ చట్టం.. భారత విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలను?

ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు!!

అవమానభారం భరించలేక ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా...

బాలీవుడ్ నటుడు సైఫ్‌కు వారసత్వ ఆస్తులు దక్కేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments