బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మోస్ట్ ఎవైటెడ్ మూవీ "జాట్" విడుదలకు సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై డైనమిక్ ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న థియేటర్లలో విడుదల కానుంది.
రిలీజ్ డేట్ పోస్టర్‌లో సన్నీ డియోల్ ఇంటెన్స్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు. భుజంపై భారీ తుపాకీతో ఫెరోషియస్ గా ముందుకు సాగుతున్నాడు. బ్యాక్ డ్రాప్ లో హెలికాప్టర్, కరెన్సీ నోట్లు గాలిలో ఎగురుతున్నాయి. స్టైల్, స్వాగర్‌ను ప్రజెంట్ చేసిన సన్నీ డియోల్ లుక్ అదిరిపోయింది,
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రికార్డు స్థాయి టీజర్ విడుదల తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో ఫ్యాన్స్ లోసందడి నెలకొంది. పుష్ప 2 తో పాటు ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో ప్రదర్శించబడిన ఈ టీజర్, ఈ సంవత్సరంలో మోస్ట్ బ్లాస్ట్ యాక్షన్ డ్రామాగా నిలిచే స్టేజ్ ని సెట్ చేసింది.
ఈ చిత్రంలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కాసాండ్రా కీలక పాత్రలు పోహిస్తున్నారు.
సంగీతం థమన్ ఎస్, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. అనల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని హామీ ఇస్తున్నాయి.
ఏప్రిల్ 10 కి కౌంట్‌డౌన్ ప్రారంభమవుతున్నందున, అభిమానులు అడ్రినలిన్‌తో కూడిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.