Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

డీవీ
శుక్రవారం, 24 జనవరి 2025 (16:34 IST)
Dear krishna poster
అక్షయ్ హీరోగా, 'ప్రేమలు' మూవీ ఫెమ్ మమిత బైజు కీలక పాత్రలో, ఐశ్వర్య హీరోయిన్ గా నటించిన చిత్రం డియర్ కృష్ణ'. ఒక రియల్ సంఘటన నేపథ్యంగా ఈ సినిమా నిర్మించామని నిర్మాత తెలియజేశారు. పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై  పి.ఎన్. బలరామ్ నిర్మించారు.  డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: దినేష్ బాబు వ్యవహరించారు. ఎడిటర్: రాజీవ్ రామచంద్రన్, సంగీతం: హరి ప్రసాద్, లిరిక్స్: గిరిపట్ల, ప్రచారకర్తలు: హరీష్, దినేష్. మలయాళంలో రూపొందిన ఈ సినిమా నేడు తెలుగులో విడుదలైంది. అదెలా వుందో చూద్దాం.
 
కథ:
హీరో అక్షయ్ (అక్షయ్) కాలేజ్ కుర్రాడు. తండ్రి బాలకృష్ణ (అవినాష్) రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఒక్కడే కొడుకుకావడంతో గారాబంతోపాటు స్నేహితుడిలా తండ్రి చూసుకుంటూ సలహాలు ఇస్తుంటాడు. తండ్రి క్రిష్ణ భక్తుడు. అక్షయ్ తల్లి (శాంతి కృష్ణ). కాలేజీ చదువుతుండగానే రాధిక (ఐశ్వర్య) ను ప్రేమిస్తాడు. తనూ ప్రేమిస్తుంది. కానీ రాధిక తల్లిదండ్రులు ససేమిరా అంటారు. ఓరోజు కాలేజీ ఫంక్షన్ లో డాన్స్ వేస్తుండగా హఠాత్తుగా పడిపోతాడు అక్షయ్. ఆసుపత్రికి తీసుకెళితే రకరకాల పరీక్షలు చేసి లోపల అవయవాలన్నీ డామేజ్ అయ్యాయి. క్రిటికల్ కండిషన్ అంటూ డాక్టర్లు తేల్చేస్తారు. కొడుకును రక్షించుకోవాలని విదేశీ డాక్టర్లను కూడా రప్పించి ట్రీట్ మెంట్ ఇస్తారు. వారూ ఒన్ పర్సెంట్ ఛాన్స్ అని తేలుస్తారు. అసలు ఏ అలవాట్లు లేని అక్షయ్ కు ఇలా ఎందుకు జరిగింది? చివరికి తను బతికాడా? లేదా? ఈ క్రమంలో సాగే కథనమే మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఈ చిత్రంలో యువత అంతా టీనేజ్ వాళ్ళే. కాలేజీ లైఫ్, అక్షయ్ అమ్మానాన్న ల మధ్య ఉన్న రిలేషన్ షిప్, ఫ్రెండ్షిప్, అక్షయ్ తోటి విద్యార్థులకు చేసే సహాయాలను పరిచయం చేశారు. అలాగే హీరోయిన్ ఐశ్వర్య, అక్షయ్ ల మధ్య లవ్ ట్రాక్ మొదటి భాగం సాధారణంగా సాగిపోతుంది. స్నేహితురాలిగా చిత్ర పాత్రలో మమిత బైజు ఆకట్టుకుంది. అక్షయ్ కున్న ఆరోగ్య సమస్య బయటపడిన తర్వాత అసలైన సంఘర్షణ మొదలవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ యూత్ ను కట్టి పడేసేలా రాసుకున్నారు. ఈ జంటకు ఉండే లవ్ సమస్యను కూడా చాలా ప్రాక్టికల్ గా చూపించారు. 
 
అక్షయ్ ఆరోగ్య సమస్య తెలీకుండా తండ్రి జాగ్రత్తపడ్డా అతనికి తెలియడంతో హ్రుద్యంగా సాగుతుంది. సెకండాఫ్ అంతా మెడికల్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ పాయింట్స్ ను చూపించాడు. ఆ క్రమంలో దైవభక్తి ఎలా పనిచేస్తుందో చూపించారు. సెకండాఫ్ చాలా వరకు ఆసుపత్రిలో పేషెంట్ అటూ ఇటూ అన్నట్లుగా డాక్టర్లు చెప్పినా ఏదో తెలీని శక్తి అంటే తన దేవుడే కాపాడతాడు అంటూ గురువాయురప్పను నమ్ముకున్న తండ్రి ఆవేదన, వేడుకోలు దర్శకుడు చూపించాడు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే కొన్ని సన్నివేశాలు దర్శకుడు చూపించాడు.  సెకండాఫ్ సినిమాకు కీలకం గనుక దానిపైనే ఎక్కువ దర్శకుడు కేర్ తీసుకున్నాడు.
 
హీరోగా నటించిన అక్షయ్ పేషెంట్ గా బాగా సూటయ్యాడు. అభినయం సహజంగా చేశాడు. ఆ తర్వాత తండ్రిగా నటించినా అవినాష్ పాత్ర. ఫస్టాఫ్ అంతా కేవలం కొడుకుతో స్నేహంగా ఉండే భావోద్వేగాలను పండించి సెకండ్ హాఫ్ లో లోతైన భావోద్వేగాల సంఘర్షణను చూపిస్తూ ప్రేక్షకుడిని సైతం కంటతడి పెట్టేలా చేశారు. తల్లి పాత్రలో నటించిన శాంతి కృష్ణ అద్భుతమైన ఎమోషనల్ సీన్స్ అందించారు. మమత బైజు మంచి నటనను కనబరిచారు. హీరోయిన్ గా ఐశ్వర్య అభినయం అందం నటన సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. మిగతా నటీనటులంతా తమకున్న పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు.
 
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్టర్ దినేష్ బాబు యదార్థ సంఘటనను సినిమాటిక్ గా చూపించారు. హరి ప్రసాద్ సంగీతం నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. పాటలు బాగున్నాయి. అలాగే ఎమోషనల్ సీన్స్ లో వచ్చే బిజిఎం ఓకే. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు తగినట్లుగా వున్నాయి. నిర్మాత పిఎన్ బాలు  అందించిన విధానం బాగుంది.
 
తీర్పు:
హీరో అక్షయ్ జీవితంలో 2015లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. వైద్య చరిత్రలోనే ఇది అరుదైనదే. ఎందుకంటే క్రిష్ణతత్వాన్ని నమ్మే భక్తులకు ఆయన విలువ తెలుసు. పురాణాల్లోనే గురువాయురప్ప గురించి చాలా కథలున్నాయి.

ఆది శంకరుల కాలంలోనే నారాయణ అనే భక్తుడు తన కొడుక్కు వచ్చిన రోగాన్ని డాక్టర్లు సాల్వ్ చేయకపోగా రెండు రోజుల్లో చనిపోతారని చెబుతారు. ఆ సమయంలో గురువు, వాయువు రూపంతో మిళితమై కేరళలో వున్న గురువాయురప్ప క్షేత్రానికి వెళ్ళి ఎలా నయం చేసుకున్నాడనేది అద్భుతంగా వుంటుంది. అది కొంత అవగాహన వుందేమో, వాయురూపంలో క్రిష్ణుడు ఆపరేషన్ థియేటర్ కు రావడం బాగా చూపించారు. అయితే పురాణాల్లో చరిత్రను మరింతగా తెలుసుకుని దర్శకుడు సినిమా తీస్తే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అయ్యేది. ఏదిఏమైనా మంచి సాహసం చేసి సినిమా తీసినందుకు అభినందించాల్సిందే.
రేటింగ్ : 2.5/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ చట్టం.. భారత విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలను?

ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు!!

అవమానభారం భరించలేక ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా...

బాలీవుడ్ నటుడు సైఫ్‌కు వారసత్వ ఆస్తులు దక్కేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments