Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ ఆవిష్కరించిన డియర్ కృష్ణ ట్రైలర్

Advertiesment
Dear Krishna- Mamita Baiju

డీవీ

, బుధవారం, 15 జనవరి 2025 (18:19 IST)
Dear Krishna- Mamita Baiju
అక్షయ్ హీరోగా ఐశ్వర్య హీరోయిన్ గా 'ప్రేమలు' చిత్రం బ్యూటీ మమిత బైజు కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం డియర్ కృష్ణ. ఈ చిత్రం ట్రైలర్ ను నేడు రైటర్ కమ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు సర్వత్ర మంచి స్పందన వస్తుంది. పీఎన్ బలరామ్ రచయిత, నిర్మాతగా, దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే,  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్దం అయింది.
 
ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, డియర్ కృష్ణ ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ లో ప్రతి షాట్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుందని పేర్కొన్నారు. ఈ సినిమాలో ప్రేమలు హీరోయిన్ మమతా బైజు హీరోయిన్ గా నటించడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి అన్నారు. ఈ సినిమా కచ్చితంగా ఘన విజయం సాధించాలని దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు. 
 
సినీ నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. డియర్ కృష్ణ ట్రైలర్ చాలా బాగుందని, వినూత్నమైన కథతో, వినూత్నమైన రీతిలో ప్రమోషన్స్ చేయడం నచ్చింది అని అన్నారు. రియల్ ఇన్సూరెన్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తలకెక్కించడం మెచ్చుకోదగ్గ విషయం అన్నారు. ఈ చిత్రం మలయాళం తెలుగులో ఒకేసారి విడుదల చేస్తున్నారని ఇలాంటి చిత్రాలు మరెన్నో చేయాలని చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు 
విశ్వ హిందూ పరిశత్ వాళ్లు కూడా ట్రైలర్ చూసీ మేకర్స్ ను కొనియాడరు. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయని, కచ్చితంగా డియర్ కృష్ణ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని చెప్పారు. కథాకథనాలలో మాత్రమే కాకుండా, ప్రచార కార్యక్రమాల్లోనూ కొత్తదనాన్ని చూపిస్తోంది టీమ్. తాజాగా మరోక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. సినిమా టికెట్ బుకింగ్ చేస్తే అక్షరాల పదివేలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. 
 
మొదటి 100 టికెట్ల బుకింగ్ లో ఒక టికెట్ ను ఎంపిక చేసి ఆ టికెట్ దారుడికి రూ. 10000 క్యాష్ బ్యాక్ కింద బహుమతిగా అందించనున్నట్ల చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ ప్రక్రియను వారం రోజుల పాటు కొనసాగించనున్నట్లు చెప్పారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ సంఘటనను ను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. నిర్మాణంతర పనులు పూర్తి చేసుకున్న డియర్ కృష్ణ జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా టికెట్లను బుక్ చేసుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటారని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పుష్ప-3'పై కీలక అప్‌డేట్!!